Thandel: తండేల్ సినిమా చూస్తూ.. వెక్కి వెక్కి ఏడ్చిన లేడీ
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. మూడు రోజుల్లోనే రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఎంతో హృద్యంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు. కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎమోషనల్ గా చూపించారు. దీంతో ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే థియేటర్ లో తండేల్ సినిమా చూస్తూ ఓ మహిళ అభిమాని ఎమోషనల్ అయ్యింది. సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవిలకు సంబంధించిన ఓ సీన్ ప్లే అవుతుండగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో బన్నీ వాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇకపై హెల్మెట్ పెట్టుకోకపోతే.. మీ బైక్ స్టార్ట్ కాదు
‘నాన్నా నువ్వు చనిపోతావా..’ కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సైఫ్
సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
