సాయి పల్లవిని చూసి ఆశ్చర్యపోయిన నాగ్.. ఆకాశానికెత్తుతూ ట్వీట్!
లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మరో చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం ఫిబ్రవరి 07న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా... రిలీజైన మూడు రోజుల్లోనే దాదాపు రూ. 62 కోట్ల వసూళ్లు సాధించింది.
వంద కోట్ల వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. అక్కినేని ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది. దీంతో చైతూ నాన్న కింగ్ నాగార్జున… కొడుకు సక్సెస్ పై రియాక్టయ్యారు. తన బిడ్డను మెచ్చుకోవడంతో పాటే.. ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన సాయి పల్లవిని ఆకాశానికెత్తేశారు. ప్రియమైన చైతూ.. నా కొడుకుగా నిన్ను చూసి గర్వపడుతున్నా. తండేల్ ఒక సినిమా మాత్రమే కాదు. ఇది నీ ఎనలేని అభిరుచికి, నీ కృషికి, పెద్ద కలలు కనే ధైర్యానికి నిదర్శనం అంటూ తన బిడ్డను ప్రశంసిస్తూ తన ట్వీట్లో రాసుకొచ్చారు నాగార్జున. తన కొడుకును ప్రశంసించడంతో పాటు.. అక్కినేని అభిమానులందరూ ఓ కుటుంబంలా అండగా నిలిచారంటూ కొనియాడారు. ఇక తండేల్ విజయం మనందరిదనీ.. మీ అంతులేని ప్రేమాభిమానాలు, మద్దతుకు ధన్యవాదాలంటూ కింగ్ నాగ్ ఎమోషనల్ అయ్యారు. తండేల్ సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు బన్నీ వాసుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన సాయిపల్లవి అద్భుతమైన టాలెంట్ తనకు ఆశ్చర్యానికి గురి చేసిందంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ క్షణాలను మరిచిపోలేని విధంగా చేసిన డైరెక్టర్ చందూమొండేటి, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన తండేల్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ తన ట్వీట్ ముగించారు నాగ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటిని అమ్మి ప్రియుడితో పరారైన భార్య.. పాపం చివరికి భర్త..
గాయానికి కుట్లకు బదులు ఏకంగా ఫెవిక్విక్ రాసి చికిత్స.. కట్ చేస్తే..
అడవి పంది అనుకుని వ్యక్తిపై కాల్పులు.. సీన్ కట్ చేస్తే
సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ ఇంట ఉంటే..
TOP 9 ET News: రూ.100 కోట్ల దిశగా తండేల్..సాధించిన చైతూ | విశ్వక్ సేన్ కొంపముంచిన పృథ్వీ మేక డైలాగ్

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
