సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ ఇంట ఉంటే..
హిందూ సంప్రదాయంలో కొన్ని రకాల చెట్లను పవిత్రమైనవిగా, పూజనీయమైనవిగా భావిస్తారు. తులసి, వేప, రావిలాంటి చెట్లను దేవతా వృక్షాలుగా పూజిస్తారు. కొన్ని రకాల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకుంటే శుభప్రదంగా భావిస్తారు. అలాంటివాటిలో కలబంద మొక్క ఒకటి. అయితే ఈ కలబంద మొక్క పువ్వులు కూడా పూస్తుందని చాలామందికి తెలియదు.
శాస్త్రం ప్రకారం కలబంద మొక్క, దాని పువ్వు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కలబంద పూలు పూస్తే అవి అదృష్టానికి సంకేతంగా చెబుతారు. అదెలాగో..ఏంటో చూద్దాం. కలబంద పువ్వులు అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో మాత్రమే పూస్తాయి. మీ ఇంట్లో కలబంద పువ్వు పూయాలనుకుంటే సూర్యరశ్మి సమృద్ధిగా ప్రసరించే ప్రదేశంలో పెంచాలి. ఈ మొక్కలు పూలు పూయాలంటే సూర్యరశ్మి చాలా అవసరం. కాబట్టి, నీడ ఉన్న ప్రదేశాలో దీనిని పెంచకూడదు. కలబంద మొక్కలను ఇంటి లోపల కూడా పెంచవచ్చు. కానీ, అవి పెరిగి పూలు వికసించే అవకాశం ఉండదు. శాస్త్రం ప్రకారం..కలబంద మొక్కతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు. కలబంద మొక్క నారింజ లేదా ఎరుపు పువ్వులతో వికసిస్తే అది శుభ సూచకంగా పరిగణిస్తారు. కలబంద పువ్వు సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. కుటుంబ సభ్యులలో ప్రేమ నిండివుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రూ.100 కోట్ల దిశగా తండేల్..సాధించిన చైతూ | విశ్వక్ సేన్ కొంపముంచిన పృథ్వీ మేక డైలాగ్
రూ.8 లక్షలతో స్పోర్ట్స్ బైక్.. ఇండియాలోనే తొలి కొనుగోలుదారుడిగా హీరో రికార్డ్
విశ్వక్ కోసం ఎందుకు వెళుతున్నావని నన్ను ప్రశ్నించారు
Thandel: 3 రోజుల్లో రూ.62 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర తండేల్ దిమ్మతిరిగే వసూళ్లు