విశ్వక్ కోసం ఎందుకు వెళుతున్నావని నన్ను ప్రశ్నించారు
విశ్వక్ సేన్ హీరోగా... రామ్ నారాయణ్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ లైలా..! విశ్వక్ లేడీ గెటప్‌లో ఈ మూవీలో కనిపించనున్నాడని తెలియడంతో.. ఈ మూవీపై క్యూరియాసిటీ పెరిగింది. లైలాగా విశ్వక్ లేడీ గెటప్ వీడియో.. ఆ క్యూరియాసిటీని మరింతగా పెంచింది. ఇక ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరు చేతుల మీదుగా.. హైద్రాబాద్ లో జరిగింది.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరు ఈ మూవీ గురించి హీరో విశ్వక్ గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాను విశ్వక్ సేన్ ఫంక్షన్ కు వెళ్తున్నాను అంటే.. ఆ హీరో ఫంక్షన్ కు ఎందుకు వెళ్తున్నావని కొందరన్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు చిరు. విశ్వక్ ఎప్పుడూ అవతలి వాళ్లు అంటే బాలకృష్ణ, తారక్ అంటాడు కదా… అలాంటి హీరో ఫంక్షన్ కు వెళ్తావా అని తనను అడిగారన్నారు. బాలయ్య, తారక్ మీద ఆయనకు ఇష్టముంటే.. తన మీద ప్రేమ ఉండకూడదా అని వాళ్లను అడిగా అన్నారు చిరు. ఇక తమ ఇంట్లో అబ్బాయికి సూర్య అంటే ఇష్టమని.. అలాగని తాము కలిసి భోజనం చేయట్లేదా… ఇదీ అంతే అంటూ చెప్పారు చిరు. ఇండస్ట్రీలో హీరోల మధ్య సఖ్యత ఉండదేమో అనుకునేవాళ్ళు. కాని అలా కాదని చెప్పారు చిరు. హీరోల మధ్య సఖ్యత కోసం ఇండస్ట్రీకి తాను హీరోగా మారిన తరువాత ఏం చేశావారో చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thandel: 3 రోజుల్లో రూ.62 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర తండేల్ దిమ్మతిరిగే వసూళ్లు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

