Thandel: 3 రోజుల్లో రూ.62 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర తండేల్ దిమ్మతిరిగే వసూళ్లు
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది తండేల్. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ డే నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మొదటి రోజే ఈ సినిమాకు రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. అలాగే రెండు రోజుల్లోనే ఏకంగా రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక వీకెండ్ కావడంతో ఆదివారం బుకింగ్స్ మరింత పెరిగాయి. దీంతో మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది
తండేల్ మూవీ.. ఇక తండేల్ మూవీ మూడు రోజుల్లోనే రూ.60 కోట్ల మార్క్ క్రాస్ చేసి మొత్తం రూ.62 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు థియేటర్లలో తండేల్ జోరు చూస్తుంటే ఈ వారంలోనే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ సినిమాపై ముందు నుంచి చైతన్య ఎక్కువగానే నమ్మకం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇందులో చైతూ యాక్టింగ్ ఇరగదీశాడు. లవ్ స్టోరీ తర్వాత చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది. వీరిద్దరి యాక్టింగ్, డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉన్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు స్పెషల్ హైలెట్ అయ్యింది మ్యూజిక్. ఈ చిత్రం చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛాట్ జీపీటీ Vs డీప్‌సీక్.. ఇండియా పోటీ పడేదెప్పుడు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

