రూ.8 లక్షలతో స్పోర్ట్స్ బైక్.. ఇండియాలోనే తొలి కొనుగోలుదారుడిగా హీరో రికార్డ్
తెలుగుతో పాటు దాదాపు 7 భాషల్లో నటించిన అతి తక్కువ నటుల్లో మాధవన్ కూడా ఒకరు. ఈ ట్యాలెంటెడ్ నటుడికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటీవలే హిసాబ్ బరాబర్ అంటూ మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు మాధవన్. ఇక ఈ హ్యాండ్సమ్ హీరోలకు బైకులంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన గ్యారేజ్ లో పలు బ్రాండెడ్ కంపెనీల లగ్జరీ బైకులు ఉన్నాయి.
తాజాగా మరో ఖరీదైన బైకును కొనుగోలు చేశాడు మాధవన్. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ రంగంలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా గర్తింపు ఉన్న బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ బైక్‌ను తన గ్యారేజ్ లోకి తెచ్చుకున్నాడు మాధవన్. అంతేకాదు రెట్రో డిజైన్ తో పాటు మోడ్రన్ ఇంజినీరింగ్ వర్క్ స్టైల్ తో ఉన్న ఈ బైక్ ను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడిగా మాధవన్ రికార్డుల కెక్కారు. ఇక ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బ్రిక్ట్సన్ ఇటీవలే భారతదేశంలో తన విక్రయాలను ప్రారంభించింది. మోటోహాస్ భాగస్వామ్యంతో బ్రిక్ట్సన్ భారతదేశంలో అడుగు పెట్టింది. బెంగళూరు, కోల్హాపూర్, గోవా, అహ్మదాబాద్ తదితర ప్రముఖ నగరాల్లో డీలర్‌షిప్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. జైపూర్, మైసూర్, కోల్‌కతా, పూణే, ముంబైలలో షోరూమ్‌లు రానున్నాయి. ఈ క్రమంలోనే మాధవన్ తొలి బైక్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న లగ్జరీ బైక్ ను కొనుగోలు చేశారు. ఈ బైక్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తుండడం విశేషం. కొత్త బైక్‌పై తన కుమారుడు వేదాంత్ పేరును చేర్చాడు మాధవన్. ఇక ఈ లగ్జరీ బైక్ విషయానికి వస్తే.. ఇండియన్ మార్కెట్ లో దీని ధర సుమారు రూ. 7.84 లక్షలు గా ఉంది. దీని ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవెల్ అన్న టాక్ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశ్వక్ కోసం ఎందుకు వెళుతున్నావని నన్ను ప్రశ్నించారు
Thandel: 3 రోజుల్లో రూ.62 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర తండేల్ దిమ్మతిరిగే వసూళ్లు

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
