Post Office Scheme: ప్రతినెలా రూ.20 వేలు వడ్డీ ఇచ్చే పోస్టాఫీస్ స్కీమ్! అస్సలు మిస్ చేసుకోవద్దు!
ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్‌గా పొదుపు చేయాలి అనుకునేవారికి పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా వీటి నుంచి మంచి రాబడి పొందొచ్చు. పైగా ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. అయితే పోస్టాఫీస్‌లో నెలకు రూ.20 వేలు వడ్డీ ఇచ్చే సూపర్ స్కీ్మ్ ఒకటుంది. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ లో చాలా రకాల ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో పిల్లల నుండి వృద్ధుల వరకూ.. హౌజ్ వైఫ్స్ నుంచి ఎంప్లాయీస్ వరకూ అందరికీ సూట్ అయ్యేలా రకరకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS) గురించి చాలామందికి తెలియదు. ఇందులో కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్ అయిన తర్వాత నెలకు రూ.20 వేల వరకూ ఆదాయం పొందొచ్చు. ఈ స్కీమ్ గురించిన ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే..
స్కీమ్ డీటెయిల్స్
రిటైర్మెంట్ తర్వాత మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్నేళ్ల వరకూ స్థిరంగా నెలవారీ ఆదాయం పొందే వీలుంటుంది. ఈ స్కీమ్ పై ఏడాదికి 8.2% వడ్డీ పొందొచ్చు. ఇది బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటు కంటే ఎక్కువ. అలాగే ఈ స్కీమ్ లో పెట్టే పెట్టుబడులపై ప్రభుత్వం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ను అందిస్తుంది.
ఎలిజిబిలిటీ
పోస్టాఫీస్ సీనియర్ సిటిజెన్ స్కీమ్ కేవలం 60 ఏళ్లు దాటిన వారికే వర్తిస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 55 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు, డిఫెన్స్ రంగంలో పని చేసి రిటైర్ అయిన 50 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు కూడా ఈ స్కీమ్ కు అర్హులే.
ఆదాయం ఇలా..
ఇకపోతే ఈ స్కీమ్ మెచూరిటీ కాలం 5 సంవత్సరాలు. ఈ స్కీమ్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు మీరు ఈ స్కీమ్ లో 30 లక్షలు పెట్టుబడి పెడితే 8.2% వడ్డీ కింద ఏడాదికి రూ. 2.46 లక్షలు వస్తుంది. అంటే నెలకు రూ. 20,500. ఈ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం దగ్గరలోని ఏదైనా పోస్టాఫీస్‌కు వెళ్లొచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు. అలాగే ఈ స్కీమ్‌కు సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. వాటిని పూర్తిగా చదివి తెలుసుకున్నాకే అకౌంట్ ఓపెన్ చేస్తే మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




