Income Tax Calculator: మూలధన లాభాలపైనే ఆశలన్నీ.. మినహాయింపు లభించేనా?
భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయంలో తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2025 బడ్జెట్ ప్రసంగంలో మూలధన లాభాలు వంటి ప్రత్యేక రేటు ఆదాయం తప్ప" వార్షిక ఆదాయంపై రూ. 12 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అయితే పన్ను చెల్లింపుదారుల్లో మూలధన లాభాలు వారి పన్ను సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో? తెలియక గందరగోళానికి గురవుతున్నారు.

రూ. 13 లక్షల వార్షిక జీతంలో రూ. 1 లక్ష మూలధన లాభాలైతే అది వారిని రూ. 12 లక్షల పన్ను రాయితీకీ అర్హులుగా చేస్తుందా ? అనే అనుమానం అందిరికీ ఉంది. సీబీడీటీ ‘ఆర్థిక బిల్లు-2025కు సంబంధించిన ముఖ్యాంశాలను విడుదల చేసింది. సాధారణంగా సెక్షన్ 87ఏ రాయితీని లెక్కించడం నుంచి మూలధన లాభాలను మినహాయించాలని వివరిస్తుంది. సీబీడీటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం వ్యక్తులు సెక్షన్ 115 బీఏసీకు సంబంధించిన కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ప్రత్యేక రేట్ల వద్ద పన్ను విధించదగిన ఆదాయాలు (ఉదాహరణకు, సెక్షన్ 111ఏ, సెక్షన్ 112 కింద పన్ను విధించదగిన మూలధన లాభాలు మొదలైనవి) సెక్షన్ 87ఏ రిబేటును లెక్కించకుండా మినహాయించాలని ప్రతిపాదిస్తున్నారు. ఉదాహరణకు మీరు ఒక సంవత్సరంలో రూ. 13 లక్షలు సంపాదిస్తే, అందులో రూ. లక్ష మూలధన లాభాలతో సహా, ఈ రూ. 1 లక్ష రూ. 13 లక్షల నుంచి మినహాయిస్తారు. మీరు రూ. 12 లక్షల పరిమితిలోపు వచ్చే 87ఏ కింద ఆదాయపు పన్ను రాయితీకి అర్హులు అవుతారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2025 బడ్జెట్ సందర్భంగా కొత్త విధానంలో రూ. 12 లక్షల ఆదాయం (అంటే మూలధన లాభాలు వంటి ప్రత్యేక రేటు ఆదాయం కాకుండా నెలకు సగటున రూ. 1 లక్ష ఆదాయం) వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రకటించారు. రూ. 75,000 ప్రామాణిక మినహాయింపు కారణంగా జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు ఈ పరిమితి రూ. 12.75 లక్షలుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీ పెట్టుబడిని విక్రయించి దానిపై లాభం పొందినప్పుడు మూలధన లాభాలు వస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక కంపెనీ షేర్లను రూ. 1 లక్షకు కొనుగోలు చేసి ఇప్పుడు దానిని రూ. 1.20 లక్షలకు అమ్మితే మీకు అదనంగా వచ్చిన రూ. 20,000 మూలధన లాభాలుగా పరిగణిస్తరు. కాలపరిమితి ఆధారంగా మూలధన లాభాలు రెండు రకాలుగా ఉంటాయి. స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాలు అని రెండు రకాలు ఉంటాయి.
లిస్టెడ్ కాని షేర్లకు దీర్ఘకాలిక ఆస్తులుగా అర్హత పొందడానికి హోల్డింగ్ వ్యవధి 24 నెలలుగా ఉంటుంది. లిస్టెడ్ షేర్లకు ఇది 12 నెలలుగా ఉంటుంది. ఈ పరిమితుల కంటే తక్కువ లాభాలను ఎస్టీసీజీగా పరిగణిస్తారు. ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసిన 12 నెలల్లోపు విక్రయించినప్పుడు స్వల్పకాలిక మూలధన లాభాలు (ఎస్టీసీజీ)గా వర్తిస్తాయి. గతంలో 15 శాతం పన్ను విధించిన బడ్జెట్ 2024లో ఎస్టీసీజీ పన్ను రేటును 20 శాతానికి పెంచారు. అలాగే ఈక్విటీ ఆస్తులను 12 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచుకుంటే దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్ను వర్తిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








