Banking News: ఆ బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. వచ్చేనెల నుంచి పలు సేవలు బంద్.. వివరాలు

Banking News: మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా..? అయితే మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 21 నుంచి కొన్ని సర్వీసులును నిలిపివేయనుంది. ఆ వివరాలేంటో

Banking News: ఆ బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. వచ్చేనెల నుంచి పలు సేవలు బంద్.. వివరాలు
Alert To Bank Of India Customers
Follow us

|

Updated on: Mar 22, 2021 | 7:00 PM

Banking News: మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా..? అయితే మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 21 నుంచి కొన్ని సర్వీసులును నిలిపివేయనుంది. ఆ వివరాలేంటో ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకోండి. బ్యాంకు కార్డ్ షీల్డ్ అప్లికేషన్‌ గురించి బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 21 తర్వాత ఈ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. కార్డ్ షీల్డ్ వివరాలను ఏప్రిల్ 21కి ముందు అప్డేట్ చేసుకోవాలని లేకపోతే.. సర్వీసులు నిలిచిపోతాయని, కార్డులు కూడా పనిచేయవంటూ వెల్లడించింది.

సంబంధిత గడువు దాటిన తరువాత యాప్ కనిపించబోదని తెలిపిది. కార్డులు కూడా పని చేయవని సకాలంలో కార్డ్ షీల్డ్‌ను అప్డేట్ చేసుకోవాలని కోరింది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విషయాన్ని వెల్లడించింది. బ్యాంక్ ఈ సర్వీసులను బీఓఐ మొబైల్ యాప్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో అనుసంధానం చేస్తోంది. దీనిలో కొత్త యాప్‌ను సైతం డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. దీనికోసం లింకులను సైతం పంచుకుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు షీల్డ్ ద్వారా ఖాతాదారులు తమ డెబిట్ కార్డును కంట్రోల్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీంతో ఎప్పుడు, ఎక్కడ, ఎలా డెబిట్ కార్డు ఉపయోగించామో తెలుసుకోవచ్చు. ఒకవేళ కార్డును ఎక్కడైనా మరచిపోతే దానిని ఆఫ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లావాదేవీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. కార్డుపై లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మరికొన్ని అత్యాధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

Also Read:

Maruti Suzuki Cars: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి..