Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New EPF rules: ఈపీఎఫ్ చందాదారులకు అలెర్ట్.. ఆ నిబంధనల్లో కీలక మార్పులు

వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనే ఉద్యోగ విరమణ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని మినహాయించి దీనిలో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం కూడా అందిస్తుంది. తద్వారా ఆ ఉద్యోగి విరమణ సమయానికి పెద్ద మొత్తం పోగవుతుంది. అతడి భవిష్యత్తు జీవితానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అయితే అనుకోని సందర్భంలో ఆ ఉద్యోగి మరణిస్తే అతడికి కుటుంబానికి అండగా ఉండడం కోసం ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ (ఈడీఎల్ఐ) కూడా దానిలో కలిసే ఉంటుంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈడీఎల్ఐ పథకంలో నూతన మార్పులు తీసుకువచ్చారు. కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ఈ మార్పుల గురించి తెలుసుకుందాం.

New EPF rules: ఈపీఎఫ్ చందాదారులకు అలెర్ట్.. ఆ నిబంధనల్లో కీలక మార్పులు
Epfo
Follow us
Srinu

|

Updated on: Mar 11, 2025 | 4:27 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) లోని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ (సీబీటీ)ల సమావేశం ఈ ఏడాది ఫిబ్రవరి 25న జరిగింది. ఈ సందర్భంగా ఈడీఎల్ఐ పథకంలో కొన్ని మార్పులను ప్రకటించారు. కార్మికుడు లేదా ఉద్యోగి మరణించినప్పుడు అతడి కుటుంబ సభ్యులకు మరింత ప్రయోజనం కలిగించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. తద్వారా వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది.

కనీస ప్రయోజనం

ఈపీఎఫ్ పథకంలో సభ్యుడిగా చేరి, ఏడాదిలోపు మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించారు. దీని ద్వారా కొత్తగా పథకంలో చేరిన సభ్యుడు ఏడాదిలో మరణిస్తే.. అతడి కుటుంబానికి ఈడీఎల్ఐ ప్రయోజనాన్ని వర్తింపజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి రూ.50 వేల సాయం అందుతుంది. దీనివల్ల ఏటా సుమారు 5 వేల కంటే ఎక్కువ కుటుంబాలకు ఉపయోగం కలుగుతుంది.

నిబంధన సడలింపు

ఈఎల్ డీఐ పథకం ప్రయోజనాలను పొందటానికి గతంలో నిబంధనలు కొంచెం కఠిన తరంగా ఉండేవి. చందా చెల్లించని కాలం తర్వాత ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే క్లెయిమ్ ను తిరస్కరించేవారు. వీటిని యాక్టివ్ సర్వీస్ వెలువల జరిగినట్టు నిర్ధారణ చేేసేవారు. దీని వల్ల కుటుంబాలు ఈఎల్ డీఐ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ.7 లక్షల ప్రయోజనం పొందలేకపోయేవారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిబంధనను సడలించారు. దాని ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యుడు తన ఖాతాలో చివరి సహకారం అందుకున్న ఆరు నెలల్లోపు మరణిస్తే, జాబితా నుంచి అతడి పేరు తొలగించకపోతే కుటుంబ సభ్యులకు ఈఎల్ డీఐ ప్రయోజనం చేకూరుతుంది. దీని ద్వారా ఏడాదికి సుమారు 14 వేలు కంటే ఎక్కువ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

విరామం ఉన్నా అర్హత

ఉద్యోగ అంతరాల సమయంలో సేవ కొనసాగింపు సమస్య కూడా పరిష్కారం కానుంది. కొత్త నియమం ప్రకారం రెండు ఉద్యోగ సమయాల మధ్య రెండు నెలల విరామం ఉన్నా నిరంతర సేవగా పరిగణిస్తారు. దీని ద్వారా ఈఎల్ డీఐ ప్రయోజనాలు పొందటానికి అందరికీ అర్హత లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..