Air Traffic: ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదలలో భారతదేశంలోని ఈ ఎయిర్‌పోర్ట్ మొదటి స్థానం
ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల విషయంలో బెంగళూరు అన్ని ఇతర నగరాలను అధిగమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే కాదు, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కూడా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమాన ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఈ త్రైమాసికంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి 84 లక్షల మంది దేశీయ విమాన ప్రయాణికులు ప్రయాణించినట్లు సమాచారం. అంతేకాకుండా బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతున్నాయి..
భారత విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరిన్ని విమానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల కాలం నుంచి ప్రయాణికుల రద్దీ కూడా పెరిగిపోవడంతో విమానాల సంఖ్య కూడా అధికంగా పెరిగిపోయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ఎయిర్‌లైన్స్ కూడా కొత్త కొత్త విమానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదలలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. అంతే కాకుండా అత్యధికంగా విమానాలు ఉన్న విమానాశ్రయాల్లో బెంగళూరు ఎయిర్ పోర్ట్ మూడో స్థానంలో ఉంది. ముఖ్యంగా బెంగుళూరు విమానాశ్రయం ఇటీవలి కాలంలో విమానాల రద్దీని ఎక్కువగా చూస్తోంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అందించిన సమాచారం ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇతర నగరాల కంటే బెంగళూరు దేశీయ విమాన ప్రయాణాలలో అత్యధిక వృద్ధిని సాధించింది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి దేశీయ ఫ్లైట్ సర్వీసుల సంఖ్య సైతం పెరిగింది.
ఆ ఆర్థిక సంవత్సరంలో బెంగళూరు విమానాశ్రయం 2.81 కోట్ల మంది దేశీయ ప్రయాణికులను హ్యాండిల్ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, బెంగళూరులో దేశీయ విమాన ట్రాఫిక్ శాతం 85 శాతం పెరిగిందని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలు చెబుతున్నాయి. కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కారణంగా ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది . ఇందులో భాగంగా కొన్ని విమాన సర్వీసులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం అతి తక్కువ ధరల్లో ప్రయాణ సేవలు అందిస్తున్నాయి.
చౌక విమాన సర్వీసులను అందించే ఆకాశ ఎయిర్ ఏర్పాటు అయి సోమవారానికి సరిగ్గా ఏడాది అవుతోంది. ఆగస్ట్ 7, 2022న విమానాలను ప్రారంభించిన అకాసా ఎయిర్, ప్రారంభంలో ముంబై, అహ్మదాబాద్ మధ్య రోజువారీ రెండుసార్లు విమానాలను నడిపింది. బెంగళూరు ఇప్పుడు ఆకాశ ఎయిర్‌కు స్థావరంగా మారింది. బెంగుళూరు విమానాశ్రయంలో విస్తారమైన రాత్రి పార్కింగ్ స్థలం ఉంది. ఆకాసా ఎయిర్‌కు చెందిన 20 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో 16 విమానాలు బెంగళూరులో పార్కింగ్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి రోజుకు 30 విమానాలు బయలుదేరుతాయి.
మొత్తం విమానాల రాకపోకల్లో ఢిల్లీ, ముంబై తర్వాత బెంగళూరు 3వ స్థానంలో ఉంది. అయితే, ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల విషయంలో బెంగళూరు అన్ని ఇతర నగరాలను అధిగమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే కాదు, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కూడా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమాన ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఈ త్రైమాసికంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి 84 లక్షల మంది దేశీయ విమాన ప్రయాణికులు ప్రయాణించినట్లు సమాచారం. అంతేకాకుండా బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి