AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఆ ఒక్క ఐడియా ఈ రైతు జీవితాన్ని మార్చేసింది.. 50 వేలు ఖర్చు చేసి 2.5 లక్షలు సంపాదించిన అన్నదాత

వ్యవసాయంలో పెట్టుబడి, నిత్యం నష్టాలు, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. వ్యవసాయం గురించి మనం తరచుగా వినే మాటలివి. కానీ ప్రస్తుతం యువ రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి ఆధునిక పద్ధతుల్లో పంటలు పండిస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ రైతు రెండు నెలల్లో రెండున్నర లక్షలు సంపాదించి మోడల్‌గా నిలిచాడు. ఎలాగో తెలుసుకుందాం...

Success Story: ఆ ఒక్క ఐడియా ఈ రైతు జీవితాన్ని మార్చేసింది.. 50 వేలు ఖర్చు చేసి 2.5 లక్షలు సంపాదించిన అన్నదాత
Watermelon Farming
Subhash Goud
|

Updated on: Apr 05, 2024 | 3:34 PM

Share

వ్యవసాయంలో పెట్టుబడి, నిత్యం నష్టాలు, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. వ్యవసాయం గురించి మనం తరచుగా వినే మాటలివి. కానీ ప్రస్తుతం యువ రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి ఆధునిక పద్ధతుల్లో పంటలు పండిస్తూ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ రైతు రెండు నెలల్లో రెండున్నర లక్షలు సంపాదించి మోడల్‌గా నిలిచాడు. ఎలాగో తెలుసుకుందాం.

ఇప్పటికే చాలా మంది రైతులు తమ పొలాలను వదిలేసి పట్టణాలకు వెళ్లి పనులకు వెళ్తున్నారు. అలాగే కొందరికి వ్యవసాయం చేస్తున్నా పెద్దగా లాభాలు రావడం లేదు. ఏదైనా పంట పండించాలంటే ముందుగా తగిన అనుభవం ఉండాలి. అప్పుడు వ్యవసాయంలో రాణించగలుగుతాడు. కానీ కొందరు యువ రైతులు మాత్రం సీజన్ కు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. జీవితంలో సరైన గురువు దొరికితే మీ జీవితంలో కొత్త మార్పు సాధ్యమవుతుందనడానికి ప్రగతిశీల రైతు నిదర్శనం. రాయ్ బరేలీ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ తన పూర్వీకుల పొలంలో సంప్రదాయ వ్యవసాయం చేసేవాడు. కానీ అతని బంధువుల్లో ఒకరు హార్టికల్చర్ తీసుకోవాలని సూచించారు.

ఓ రోజు బంధువు పవన్ వర్మ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు పుచ్చకాయ పండించమని సూచించగా.. ఆయన సలహా మేరకు పుచ్చకాయ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు ఈ సాగులో తక్కువ ఖర్చుతో పాటు అధిక లాభం ఉండటంతో ఇతర పంటలతో పోలిస్తే చాలా లాభదాయకంగా ఉంది. అలాగే వేసవి కాలంలో మార్కెట్‌లో గిరాకీ ఎక్కువగా ఉండటం వల్ల మంచి ధరకు సులభంగా విక్రయిస్తున్నారు. రాయ్ బరేలీ జిల్లాలోని శివగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్రా ఖుర్ద్ గ్రామంలో నివసిస్తున్న విజయ్ కుమార్ తన ఎకరం పొలంలో పుచ్చకాయలు పండిస్తున్నాడు. మొత్తం సీజన్‌లో దాదాపు 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు చేశాడు. ఖర్చులు తీసివేసి సీజన్ లో రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు లాభం వస్తుందన్నారు. మిగతా పంటల కంటే ఎక్కువ లాభాలు ఇచ్చే పంట ఇదని విజయ్ అన్నారు. ఇక్కడ పండే పుచ్చకాయలను రాయ్‌బరేలీ, లక్నో మార్కెట్‌లకు విక్రయానికి పంపుతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి
Watermelon Farming1

Watermelon Farming1

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పంటలు సాగు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించి ఇన్వెస్ట్ చేయండి)