Atal Pension Yojana: కార్మికులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ. 5000 పెన్షన్.. పూర్తి వివరాలు ఇవి..
ఉద్యోగం లేదా పనులు చేస్తున్న సమయంలోనే పలు పదవీవిరమణ పథకాలలో పెట్టుబడులు పట్టాలి. అప్పుడు అవి మీకు అవసరమైన దశలో అధిక రాబడినివ్వడంతో పాటు ప్రతి నెలా పింఛన్ పొందే వెసులుబాటు అందిస్తుంది. అలాంటి పథకాల్లో ఒకటి అటల్ పెన్షన్ యోజన. ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించే పథకం. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం దీనిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మన శరీరంలో శక్తి ఉన్నంత సేపు.. ఏదో ఉద్యోగం చేస్తున్నంత సేపు ఆర్థికంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి వృద్ధాప్యంలో పడితే.. ఉద్యోగ విరమణ కూడా చేసేస్తే మన రోజువారి ఖర్చుల కోసం కూడా వేరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక రోజువారి కూలీ పనులు చేసేవారు, కార్మికుల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. మరి అలాంటి సమయంలో కూడా నిశ్చింతగా, సుఖమయ జీవనం గడపాలంటే ఏం చేయాలి? ముందు నుంచే పదవీవిరమణ ప్రణాళికను కలిగి ఉండాలి. ఉద్యోగం లేదా పనులు చేస్తున్న సమయంలోనే పలు పదవీవిరమణ పథకాలలో పెట్టుబడులు పట్టాలి. అప్పుడు అవి మీకు అవసరమైన దశలో అధిక రాబడినివ్వడంతో పాటు ప్రతి నెలా పింఛన్ పొందే వెసులుబాటు అందిస్తుంది. అలాంటి పథకాల్లో ఒకటి అటల్ పెన్షన్ యోజన. ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించే పథకం. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం దీనిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద ఉన్న పెన్షన్ పథకం ఇది. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రతను అందిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన ఫీచర్లు..
- ఏపీవై అన్ని బ్యాంకు ఖాతాదారులకు అందుబాటులో ఉంటుంది.
- 18-40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఏపీవై ప్రయోజనాన్ని పొందవచ్చు.
- సభ్యత్వం పొందిన తర్వాత, మీరు పెట్టే పెట్టుబడిని బట్టి 60 సంవత్సరాల వయస్సు నుంచి నెలకు రూ. 1,000, నుంచి రూ. 5000 మధ్య స్థిరమైన కనీస పెన్షన్‌ను అందుకుంటారు.
- ఏపీవై కింద, చందాదారుడు నెలవారీ పెన్షన్‌ను పొందుతాడు. దాని తర్వాత అతని జీవిత భాగస్వామి, వారి మరణాల తర్వాత, 60 సంవత్సరాల వయస్సులో పొందిన చందాదారుల పెన్షన్ కార్పస్, చందాదారుల నామినీకి తిరిగి చెల్లిస్తారు.
- కనీస పెన్షన్ ప్రయోజనాలకు భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది.
అటల్ పెన్షన్ యోజనకు అర్హత..
- 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులు ఎవరైనా ఏపీవై కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏపీవై కోసం, ఆధార్ ప్రాథమిక కేవైసీ పత్రంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో అందుబాటులో లేకుంటే, ఆ తర్వాతి దశలో కూడా ఆధార్ వివరాలను సమర్పించవచ్చు.
- బ్యాంకులు ఆలస్యమైన చెల్లింపుల కోసం అదనపు రుసుమును వసూలు చేయాలని భావిస్తున్నారు. అది నెలకు రూ. 1 నుంచి నెలకు రూ. 10 వరకు ఉంటుంది.
- కంట్రిబ్యూషన్ నిలిపివేస్తే ఖాతా ఆరు నెలల తర్వాత స్తంభించిపోతుంది. 12 నెలల తర్వాత, చందాదారుల ఖాతా నిష్క్రియం అవుతుంది. 24 నెలల తర్వాత ఖాతాను పూర్తిగా మూసివేస్తారు. కాబట్టి మీ ఖాతా నుంచి ఆటో డెబిట్ చేయడానికి బ్యాంక్ ఖాతాలో తగినంత నిధులు ఉండాలి.
ఎంత పెన్షన్ వస్తుంది..
ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజనకి కంట్రిబ్యూట్ చేయడం ప్రారంభించినట్లయితే, వారు 60 సంవత్సరాల వయస్సు వరకు వారి కంట్రిబ్యూషన్ ప్రకారం నెలవారీ పెన్షన్ పొందుతారు. అది ఎంత మొత్తంలో ఉంటుందంటే..
- ప్రతి నెల రూ. 1000 పెన్షన్ పొందాలంటే.. మీ నెలవారీ చెల్లింపు రూ. 76 ఉండాలి. అదే త్రైమాసికానికి అయితే రూ. 226, అర్థవార్షికంగా అయితే రూ. 449 ఉండాలి.
- రూ.2000 నెలవారీ పెన్షన్ కావాలంటే..మీ నెలవారీ చెల్లింపు రూ. 151 ఉండాలి. అదే త్రైమాసికానికి అయితే రూ. 450, అర్థ వార్షికానికి అయితే రూ. 891 ఉండాలి.
- రూ. 3000 నెలవారీ పెన్షన్ పొందాలంటే.. మీ నెలవారీ చెల్లింపు రూ. 226 ఉండాలి. అదే త్రైమాసికానికి అయితే రూ. 674, అర్థ వార్షికానికి అయితే దా రూ. 1,334 ఉండాలి.
- ప్రతి నెల రూ. 4000 పెన్షన్ పొందాలంటే.. మీ నెలవారీ చెల్లింపు రూ. 301 ఉండాలి. అదే త్రైమాసికానికి అయితే రూ. 897, అర్థ వార్షికానికి అయితే రూ. 1,776 ఉండాలి.
- రూ. 5000 పెన్షన్ పొందాలంటే.. మీ నెలవారీ చెల్లింపు రూ. 376 ఉండాలి. అదే త్రైమాసికానికి అయితే రూ. 1,121, అర్థ వార్షికానికి అయితే రూ. 2,219 ఉండాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..