AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: రైతన్నలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సాయం రూ. 8000లకు పెరిగే అవకాశం.. వివరాలు ఇవి..

ఇటీవల ప్రీ బడ్జెట్ చర్చల సందర్భంగా వ్యవసాయ నిపుణులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. కొన్ని వార్త నివేదికల ప్రకారం వారు కేంద్ర బడ్జెట్లో పీఎం-కిసాన్ మొత్తాన్ని పెంచాల్సిందిగా కోరారని తెలుస్తోంది. ప్రస్తుతం రైతులకు అందిస్తున్న రూ. 6,000 సాయాన్ని రూ. 8000కు పెంచాలని అభ్యర్థించినట్లు సమాచారం.

Budget 2024: రైతన్నలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సాయం రూ. 8000లకు పెరిగే అవకాశం.. వివరాలు ఇవి..
Pm Kisan Installment
Madhu
|

Updated on: Jul 04, 2024 | 3:43 PM

Share

బడ్జెట్-2024కి సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పద్దు ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ లోపు అన్ని రంగాలకు చెందిన నిపుణులు, అధికారులు వరుసగా ఆర్థిక శాఖ మంత్రితో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రీ బడ్జెట్ చర్చల సందర్భంగా వ్యవసాయ నిపుణులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. కొన్ని వార్త నివేదికల ప్రకారం వారు కేంద్ర బడ్జెట్లో పీఎం-కిసాన్ మొత్తాన్ని పెంచాల్సిందిగా కోరారని తెలుస్తోంది. ప్రస్తుతం రైతులకు అందిస్తున్న రూ. 6,000 సాయాన్ని రూ. 8000కు పెంచాలని అభ్యర్థించినట్లు సమాచారం. 2024 బడ్జెట్‌లో వ్యవసాయ పరిశోధన కోసం అదనపు నిధులతోపాటు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా రైతులకు నేరుగా అన్ని రాయితీలు ఇవ్వాలని కూడా వారు కోరారు. ఈ క్రమంలో అసలు పీఎం-కిసాన్ పథకం ఏమిటి? దానికి ఎలా రిజిస్టర్ అవ్వాలి తెలుసుకుందాం రండి..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి..

ఫిబ్రవరి 24, 2019న పిఎం-కిసాన్ పథకం భూమిని కలిగి ఉన్న రైతులు వారి ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతుల కుటుంబాలు సంవత్సరానికి రూ. 6,000 అందుకుంటారు. ఈ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ప్రతి నాలుగు నెలలకు మూడు వాయిదాలలో చెల్లిస్తున్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల కంటే ఎక్కువ మంది రైతులు ఈ సమయం వరకు మొత్తం రూ. 3.04 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు పొందారు. ఇటీవల మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తీసుకున్న తొలి నిర్ణయం పీఎం కిసాన్ పైనే తీసుకున్నారు. ఈ పథకంలో భాగంగా 17వ విడతను అర్హులైన రైతులకు విడుదల చేయడం. ఈ విడతలో 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.దాదాపు రూ. 20,000 కోట్ల పంపిణీ జరిగింది. ఈ నేపథ్యంలో అర్హులైన పీఎం కిసాన్ లబ్ధిదారులు నగదు పడ్డాయా? లేకపోతే స్టేటస్ తనిఖీ ఎలా చేసుకోవాలి? ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. అందుకు గల కారణాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

పీఎం కిసాన్ నమోదు ఇలా..

  • పీఎం కిసాన్ వెబ్ సైట్ ని సందర్శించండి.
  • రైతుల కార్నర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • దానిలో రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్, అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రాష్ట్రం పేరు ఎంపిక చేసుకొని ‘గెట్ ఓటీపీ’పై క్లిక్ చేయాలి.
  • ఓటీపీ ఎంటర్ చేసి, ప్రోసీడ్ నొక్కాలి.
  • ఆ తర్వాత, రాష్ట్రం, జిల్లా, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత విరాలు ఆధార్ లో ఉన్న విధంగా ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్ అథంటికేషన్ సబ్మిట్ నొక్కాలి.
  • ఆధార్ అథంటికేషన్ విజయవంతమైన తర్వాత మీ భూమి వివరాలు, దానికి సంబంధించిన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
  • ఆ తర్వాత మీ స్క్రీన్ మీద దరఖాస్తు విజయవంతమైందా లేదా రిజెక్ట్ అయ్యిందా అనేది చూపిస్తుంది.

పీఎం కిసాన్ స్టేటస్ తనిఖీ ఇలా..

  • అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • బెనిఫిషియరీ స్టేటస్ పేజీని యాక్సెస్ చేయండి.
  • “బెనిఫిషియరీ స్టేటస్”పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
  • “గెట్ డేటా”పై క్లిక్ చేయండి.
  • సిస్టమ్ మీ అభ్యర్థనను ప్రాసెస్ చేసి, స్టేటస్ ను స్క్రీన్‌పై చూపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..