AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EMotorad E-Cycle: ఎంఎస్ ధోనీ పుట్టిన రోజు కానుక ఇదే.. సైక్లింగ్ ప్రియుల కోసం..

చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇమోటోరాడ్ కంపెనీ స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ సైకిల్ ను లాంచ్ చేసింది. ఇండియా క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు సందర్భంగా దీనిని ఆవిష్కరించింది. ఎంఎస్‌డీ ఎడిషన్ లెజెండ్ 07 సైకిల్ ను తీసుకొచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ సైకిల్, ప్రకాశవంతమైన పసుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

EMotorad E-Cycle: ఎంఎస్ ధోనీ పుట్టిన రోజు కానుక ఇదే.. సైక్లింగ్ ప్రియుల కోసం..
Emotorad Msd Special Edition E Cycle
Madhu
|

Updated on: Jul 04, 2024 | 4:14 PM

Share

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేవలం ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లే కాదు. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ఆరోగ్యంతో పాటు సౌకర్యం కూడా కలిసి వస్తుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. అందరూ వీటిని విరివిగా వాడుతున్నారు. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇమోటోరాడ్ కంపెనీ స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ సైకిల్ ను లాంచ్ చేసింది. ఇండియా క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు సందర్భంగా దీనిని ఆవిష్కరించింది. ఎంఎస్‌డీ ఎడిషన్ లెజెండ్ 07 సైకిల్ ను తీసుకొచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ సైకిల్, ప్రకాశవంతమైన పసుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఎంఎస్‌డీ ఎడిషన్ లెజెండ్ 07 సైకిల్..

ఎంఎస్‌డీ ఎడిషన్ లెజెండ్ 07 సైకిల్‌లో తొలగించగల బ్యాటరీ ఉంటుంది. గంటకు 25 గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఐదు స్థాయిలు గల పెడల్ అసిస్ట్ ఉంటుంది. ఈ-బైక్‌లో ఎంఎష్ ధోని సంతకం, ధోని కెప్టెన్సీలో క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయాల స్మారక చిహ్నాలను కూడా సైకిల్ పై కంపెనీ ముద్రించింది.

వన్ ఎమోషన్ – సెలబ్రేటింగ్ మహి పేరుతో..

ఇమోటోరాడ్ “వన్ ఎమోషన్ – సెలబ్రేటింగ్ మహి!” పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రారంభిస్తోంది. ఎంఎస్ ధోని పుట్టినరోజును పురస్కరించుకుని, ఏడు రోజుల పాటు ప్రత్యేక ఈవెంట్లను కంపెనీ ప్లాన్ చేసింది. ఆయా రోజుల్లో ఏడు ఆశ్చర్యకరమైన సంగతులను ప్లాన్ చేసింది. అంతేకాక ఏడుగురు లక్కీ విన్నర్స్ ని కూడా ఎంపిక చేయనుంది. అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమోటోరాడ్‌ని అనుసరించడం, ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా ఈ ఈవెంట్లో మీరూ పాల్గొనవచ్చు. దీనిద్వారా ఓ లక్కీ విన్నర్ మహితో పాటు ప్రత్యేక రైడ్‌ను గెలుచుకునే అవకాశాన్ని ఇమోటోరాడ్ కంపెనీ కల్పిస్తుంది.

ధర ఎంతంటే..

ఇమోటోరాడ్ ఎంఎస్డీ ఎడిషన్ లెజెండ్ 07 సైకిల్ ను ఇమోటోరాడ్ వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 34,999గా ఉంది. ఇది పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రత్యేకతతో, ఈ సైకిల్ సైక్లింగ్ ఔత్సాహికులు ఎంఎస్ ధోని అభిమానులకు ఇష్టమైనదిగా ఉంటుందని భావిస్తున్నారు. మరి ధోని అభిమానులు ఎంత మేరకు దీనిపై మక్కువ చూపుతారో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us