లిక్కర్ బిజినెస్‌లోకి ఫ్లిప్‌కార్ట్
లిక్కర్ బిజినెస్‌లోకి అడుగు పెట్టబోతుంది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. ముందుగా దీన్ని మన దేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో లిక్కర్ సరఫరా చేయడానికి ఫ్లిప్ కార్ట్ స్టార్టప్ డియోజియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. హిప్ బార్ రిటైల్ అవుట్లెట్ల నుంచి మద్యం..

లిక్కర్ బిజినెస్‌లోకి అడుగు పెట్టబోతుంది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. ముందుగా దీన్ని మన దేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో లిక్కర్ సరఫరా చేయడానికి ఫ్లిప్ కార్ట్ స్టార్టప్ డియోజియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. హిప్ బార్ రిటైల్ అవుట్లెట్ల నుంచి మద్యం తీసుకుకొని పంపిణీ చేయనున్నది. హిప్ బార్‌లో డియోజియోకు 26 శాతం వాటా ఉన్నది. ఐడబ్ల్యూఎస్ఆర్ మద్యం మార్కెట్ విశ్లేషణ ప్రకారం… ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు పశ్చిమ బెంగాల్‌లో మద్యం పంపిణీ చేయాలనే ఆసక్తి 27.2 బిలియన్ డాలర్ల ఆల్కహాల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సాహసోపేతమైన చర్యగా పేర్కొన్నారు. అధిక జానాభా కలిగిన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మద్యం సరఫరా చేయడం ఈ సంస్థలకు పెద్ద సవాలు కానున్నది. ఇదే సమయంలో కంపెనీ కూడా భారీ లాభాలను ఆర్జించనున్నది. కాగా ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు కూడా ఇప్పటికే కొన్ని నగరాల్లో మద్యం రవాణా చేయడం ప్రారంభించాయి.
Read More:
ధోనీ పేరుతో జొమాటో అద్భుతమైన ఆఫర్
ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు.. బస్సుల్లో వైఎస్సార్ జనతా బజార్లు



