Post Offices Online Services: పోస్టాఫీసుల్లో ఆగిన అధార్, ఆలయాల సేవలు.. ఆన్‌లైన్‌ సర్వీసులు నిలిపివేసిన తపాలా శాఖ

కరోనా నేపథ్యంలో పోస్టాఫీసుల్లో కౌంటర్‌ సేవలను ఒకపూట అందిస్తున్న తపాలా శాఖ.. ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేసింది

Post Offices Online Services: పోస్టాఫీసుల్లో ఆగిన అధార్, ఆలయాల సేవలు.. ఆన్‌లైన్‌ సర్వీసులు నిలిపివేసిన తపాలా శాఖ
Follow us

|

Updated on: Jun 07, 2021 | 9:48 AM

Post Offices Online Services Stopped: కరోనా నేపథ్యంలో పోస్టాఫీసుల్లో కౌంటర్‌ సేవలను ఒకపూట అందిస్తున్న తపాలా శాఖ.. ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను తెప్పించుకోవడం, ఆలయాలకు వెళ్లకుండానే తమ పేరిట అర్చనాభిషేకాలు చేయించుకోవడం, ఆధార్‌కార్డుల్లో మార్పులుచేర్పులు చేసుకోవడం లాంటి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తపాలా ఓ ప్రకటనలో తెలింది.

అలాగే, విద్యుత్తు, ఫోన్‌, వాటర్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయాయి. పొదుపు, ఇతర ఖాతాల్లో డబ్బు జమ చేయడం, తీసుకోవడం, పార్సిల్‌, స్పీడ్‌, రిజిస్టర్‌ పోస్టు తదితర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని పోస్టల్ శాఖ తెలిపింది. అయితే, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని సేవలు యదాతథంగా ఉంటాయని వెల్లడించింది. పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపులకు మాత్రం ప్రజలు బాగానే వస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోస్టాఫీసుల్లో కౌంటర్‌ సేవలను తపాలా శాఖ అందిస్తోంది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ సేవలను నిలిపేసినట్లు తపాలా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కరోనా కాలంలో తపాలా కార్యాలయాలు అందు బాటులో లేని ప్రాంతాల్లో తాత్కాలిక ఉద్యోగులతో సేవలు అందించింది. అలాగే, పోస్టాఫీసులు ఉన్న ప్రాంతాల్లో కూడా, పని భారం తగ్గించుకునేందుకు తాత్కాలిక ఉద్యోగులతో నిర్వహించింది.

Read Also…. Car Rash Driving Accident: నారాయణఖేడ్‌లో బొలెరో కారు బీభత్సం.. పారిశుద్ధ్య కార్మికురాలితో సహా ఇద్దరు మృతి