AC కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే కొనేయండి! లేదంటే చాలా బాధపడతారు
వేసవి కాలంలో ఏసీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఏసీ ధరలు త్వరలోనే పెరగనున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. విడిభాగాల కొరత మరియు దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరల పెంపు సంభవించనుంది. ప్రస్తుతం ఏసీ కొనుగోలు చేయాలనుకునేవారు వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ధరలు పెరిగిన తర్వాత అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది.

సమ్మర్ వచ్చిందంటే చాలా మంది వేడిమికి తట్టుకోలేక.. ఇంట్లో ఏసీలు పెట్టించుకోవాలనుకుంటారు. ప్రస్తుతం ఎలాగో సమ్మర్ సీజన్ నడిస్తోంది కాబట్టి, ఎవరైనా ఏసీ కొనాలనే ప్లాన్‌లో ఉన్నట్టయితే, ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే కొనేయండి. లేదంటా కొన్ని రోజుల తర్వాత కొంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే.. మరికొన్ని రోజుల్లో ఏసీ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏసీ విడి భాగాల కొరత కారణంగా ఏసీ తయారీ సంస్థలు ధరల పెంపుకు సిద్ధం అవుతున్నాయి. ఎవరైనా ఏసీ కొనాలనే ప్రణాళికల్లో ఉంటే ఇప్పుడు కొనేసుకోవడం మంచిది. లేదు కొన్ని రోజులు ఆగి కొనుక్కుందాం అనుకుంటే.. ఇప్పుడున్న సేమ్ ఏసీకి ఇప్పుడున్న ధరకి ఇంకాస్త ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తుంది.
అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ కారణాలు లాజిస్టిక్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాగే రూపాయి విలువ తగ్గడం, దిగుమతి ఖర్చులు పెరగడం, కంప్రెసర్లు వంటి కీలక భాగాల కొరత కారణంగా ఏసీ కంపెనీలు ధరలు పెంచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. “ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విడి భాగాల సప్లైపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో లాజిస్టిక్స్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇది ఉత్పత్తిని, కీలక విడి భాగాల లభ్యతను ప్రభావితం చేసింది” అని వోల్టాస్ MD అండ్ CEO ప్రదీప్ బక్షి అన్నారు. గత ఏడాది కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5 శాతానికి పైగా క్షీణించిందని, దీనివల్ల దిగుమతి చేసుకున్న, స్థానికంగా లభించే ముడి పదార్థాల ఖర్చులు పెరిగాయని గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది అన్నారు.
ఈ నెలాఖరు నాటికి ధరల సర్దుబాటు నిర్ణయాలు తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఏసీ కంపెనీలు దేశీయ ఉత్పత్తిని పెంచుతున్నప్పటికీ, భారతదేశ AC తయారీ వ్యవస్థ ఇప్పటికీ డిమాండ్‌ను తీర్చడంలో విఫలమైంది. దేశీయ ఉత్పత్తిని పెంచే ప్రభుత్వ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(PLI) పథకం ఉన్నప్పటికీ, ఇండియా దిగుమతులపై, ముఖ్యంగా చైనా నుండి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతూనే ఉంది. దేశానికి ఏటా 14 మిలియన్ AC యూనిట్లు అవసరం, కానీ స్థానిక కంప్రెసర్ తయారీ వ్యవస్థ సామర్థ్యం ఎనిమిది మిలియన్లగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.