AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani: గౌతమ్‌ ఆదానీ పుట్టిన రోజున భార్య ఏం చెప్పిందో తెలుసా? హృదయాన్ని హత్తుకునే ట్వీట్‌

Gautam Adani: అదానీ గ్రూప్ వ్యాపారం దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా విస్తరించి ఉంది. అలాగే ఈ గ్రూప్‌లోని 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడ్డాయి. వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ..

Gautam Adani: గౌతమ్‌ ఆదానీ పుట్టిన రోజున భార్య ఏం చెప్పిందో తెలుసా? హృదయాన్ని హత్తుకునే ట్వీట్‌
Subhash Goud
|

Updated on: Jun 26, 2025 | 3:30 PM

Share

అదానీ గ్రూప్ చైర్మన్ దేశంలో రెండవ అత్యంత ధనవంతుడు అయిన గౌతమ్ అదానీ మంగళవారంతో 63 ఏళ్లు నిండాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య ప్రీతి అదానీ, కుమారులు కరణ్, జీత్ అదానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఆయన భార్య అదానీతో ఒక చిత్రాన్ని షేర్ చేసి, ఆయనతో కలిసి నడుస్తున్నందుకు గర్వంగా వ్యక్తం చేయగా, కుమారుడు జీత్ అదానీ కూడా చిన్ననాటి ఫోటోను షేర్ చేసి ‘హ్యాపీ బర్త్‌డే పప్పా’ అని అన్నారు.

వంటగది నుండి విమానాశ్రయం వరకు వ్యాపారం:

ఇవి కూడా చదవండి

వంటగదిలో ఉపయోగించే పిండి, ఉప్పు నుంచి వివిధ రకాల వస్తువుల వరకు భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ వ్యాపారం ప్రతిచోటా వ్యాపించింది. ఆయన 1962 జూన్ 24న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. అహ్మదాబాద్‌లోని పోల్ ప్రాంతంలోని షెత్ చావ్ల్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన గౌతమ్ అదానీ, నేడు దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్ల జాబితాలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: School Bags: జపాన్‌లో స్కూల్‌ బ్యాగుల ధరలు భారీగా ఎందుకు ఉంటాయి? ఒక్కో బ్యాగు ధర రూ.18 వేల నుంచి రూ.60 వేలు

తన బికామ్ పూర్తి చేసిన తర్వాత, అతను 1978లో డైమండ్ బిజినెస్‌లో ప్రయత్నాలు కొనసాగించాడు. 1980లలో తన అన్నయ్య ప్లాస్టిక్ వ్యాపారంలో చేరాడు. 1988లో అతను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను కమోడిటీ ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభించాడు. అలాగే అతని ప్రయాణం పెరుగుతూనే ఉంది. నేడు, అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో జాబితా చేరారు. వాటి నికర విలువ $78.1 బిలియన్లు.

మీతో కలిసి నడవడం గర్వంగా ఉంది: ప్రతీ ఆదానీ

గౌతమ్ అదానీ 63వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన భార్య ప్రీతి అదానీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రీతి అదానీ తన భర్తతో కలిసి ఉన్న చిత్రాన్ని పోస్ట్‌లో షేర్ చేసి, హృదయాన్ని హత్తుకునే శీర్షికను రాశారు. ఆమె తన పోస్ట్‌లో జీవితం, అచంచలమైన పట్టుదల స్ఫూర్తి అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అసాధారణ ప్రయాణంలో మీతో కలిసి నడవడం గర్వంగా ఉంది. లెక్కలేనన్ని మంది జీవితాలను నిలబెట్టే ప్రయత్నాలను కొనసాగించేలా ఉండాలని ట్వీట్‌ చేశారు. 1986లో గౌతమ్ అదానీ, ప్రీతి అదానీల వివాహం జరిగింది.

పుట్టినరోజున కొడుకులు భావోద్వేగ పోస్ట్‌లు

భార్య ప్రీతి అదానీతో పాటు, గౌతమ్ అదానీ కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీ భావోద్వేగ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న కుమారుడు జీత్ అదానీ ఇద్దరు సోదరులతో కలిసి ఉన్న పాత ఫోటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌తో, జీత్ అదానీ తన అతిపెద్ద గురువు, మార్గదర్శిగా ఉన్నందుకు గౌతమ్ అదానీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక క్యాప్షన్ రాశారు.

అదానీ గ్రూప్ వ్యాపారం దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా విస్తరించి ఉంది. అలాగే ఈ గ్రూప్‌లోని 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడ్డాయి. వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్, NDTV, అంబుజా సిమెంట్, ACC లిమిటెడ్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Refrigerator, Washing Machine: ఈ ప్రసిద్ధ కంపెనీ సంచలన నిర్ణయం.. ఇక రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు ఉండవు!

ఇది కూడా చదవండి: School Holidays: భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..