PM Kisan: రైతులకు అలర్ట్.. వీరికి పీఎం కిసాన్ నిధులను నిలిపివేయనున్న కేంద్రం..!
PM Kisan: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ ఒకటి. ఈ స్కీమ్‌లో రైతులకు ప్రతి ఏడాది రూ.6000లను అందిస్తోంది. అది కూడా మూడు విడతల్లో రూ.2000 చొప్పున అందిస్తోంది. అయితే కేంద్రం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైతులకు పీఎం కిసాన్‌ను నిలిపివేయబోతోంది. ఎందుకో తెలుసా..?

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు 20వ విడత అందుకోవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ తదుపరి విడత పొందాలంటే రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవి పూర్తి చేసిన తర్వాతే వచ్చే విడత డబ్బులు అందుకోవచ్చు. లేకుంటే 20వ విడతలో డబ్బులు రావని గుర్తించుకోండి. అయితే ఈ కేవైసీ చేసుకోని రైతులకు పీఎం కిసాన్ నిధులను నిలిపివేయనుంది కేంద్రం.
E KYC తప్పనిసరి:
ఇప్పటి నుండి ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి మీరు e-KYC ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. ఈ కేవైసీ చేస్తేనే పీఎం కిసాన్ వచ్చే విడత డబ్బులు అందుకుంటారు. మీరు సులభంగా e-KYC ని మీరే పూర్తి చేసుకోవచ్చు. ఈ సౌకర్యం పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది. OTP ఉపయోగించి KYC పూర్తవుతుంది.
ఇలా ఈకేవైసీ చేసుకోండి..
- ముందుగా అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in ని సందర్శించండి.
- తరువాత eKYC ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
- ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు పంపబడిన OTPని సరిగ్గా నమోదు చేయండి.
- OTP ధృవీకరణ విజయవంతం అయిన తర్వాత E-KYC పూర్తవుతుంది.
ఫేస్ స్కానింగ్:
- పీఎం కిసాన్ మొబైల్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- పీఎం కిసాన్ యాప్ తెరిచి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
- తరువాత లబ్ధిదారు స్టేటస్ ఆప్షన్‌కు వెళ్లండి.
- మీరు eKYC స్థితిలో లేరని చూపిస్తే, మీరు eKYC పై క్లిక్ చేయవచ్చు.
- మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి మీ ముఖాన్ని స్కాన్ చేయాలి.
- మీరు మీ ముఖాన్ని స్కాన్ చేస్తే, మీ e-KYC పూర్తయినట్లు.
ఇది కూడా చదవండి: No Petrol: జూలై 1 నుంచి ఈ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్.. కొత్త టెక్నాలజీ!
ఇది కూడా చదవండి: Luxurious Prisons: ప్రపంచంలోని ఈ 7 జైళ్లలో ఖైదీలకు లగ్జరీ హోటల్ సదుపాయాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




