AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: ఆ మోడల్ కార్లకు సీఎన్‌జీ వేరియంట్ రిలీజ్ చేసిన మారుతీ.. మెంటలెక్కిస్తున్న ఫీచర్స్

భారతదేశంలో మారుతీ సుజుకీ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను మారుతీ సుజుకీ రిలీజ్ చేయడంతో కొనుగోళ్లు ఎప్పుడూ టాప్ ప్లేస్‌లోనే ఉంటాయి. అయితే కొనుగోలుదారులు కార్ల నిర్వహణ తక్కువయ్యేలా సీఎన్‌జీ వెర్షన్లు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ తన ప్రసిద్ధ మోడల్ అయిన గ్రాండ్ విటారాతో పాటు జీటా వేరియంట్స్‌కు సీఎన్‌జీ వెర్షన్‌ను లాంచ్ చేసింది.

Maruti Suzuki: ఆ మోడల్ కార్లకు సీఎన్‌జీ వేరియంట్ రిలీజ్ చేసిన మారుతీ.. మెంటలెక్కిస్తున్న ఫీచర్స్
Maruti Suzuki
Nikhil
|

Updated on: Jun 19, 2025 | 12:58 PM

Share

మారుతి సుజుకి 2025 సంవత్సరానికి భారతదేశంలో గ్రాండ్ విటారా సీఎన్‌జీను లాంచ్ చేసింది. దీని ధరలు డెల్టా వేరియంట్కు రూ. 13.48 లక్షలు మరియు జీటా వేరియంట్‌కు రూ. 15.62 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. గ్రాండ్ విటారా సీఎన్‌జీకు శక్తినిచ్చేది సుపరిచితమైన 1.5 లీటర్ కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌తో వస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో 88 బీహెచ్‌పీ, 121.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్‌తో వస్తుంది. ఈ వాహనం 26.6 కిమీ/కిలోల ఆకట్టుకునే ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది ఆర్ధిక, పర్యావరణ అనుకూలమైన వెర్షన్ల కోసం చూస్తున్న కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది.

2025 మోడల్‌లో కారులో భద్రత విషయంలో పెద్ద అప్ గ్రేడ్ కనిపిస్తుంది. మారుతి ఇప్పుడు రెండు వేరియంట్లలో ఆరు ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా అందిస్తుంది. ఇతర భద్రతా జోడింపులలో హిల్ హెూల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పీ), ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ముందు, వెనుక డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. సౌకర్యం విషయం వచ్చేసరికి జీటా వేరియంట్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పీఎం 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జింగ్, క్లారియన్ ద్వారా ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి లక్షణాలతో ఆకట్టుకుంటుంది.

మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్ధ బెనర్జీ మాట్లాడుతూ కొత్త గ్రాండ్ విటారా ఎస్-సీఎన్‌జీ అత్యుత్తమ ఇంధన సామర్థ్యం, బలమైన భద్రతను అందిస్తుంది. అదే సమయంలో గొప్ప ఎస్‌యూవీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది కస్టమర్ విశ్వాసాన్ని గెలుచుకుంటుందని విశ్వసిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే