పాన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఇది చేయకపోతే భారీ ఫైన్
వినియోగదారులకు అలర్ట్... మీ ప్యాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేశారా? లేదంటే వెంటనే చేయండి. ఆలస్యం చేస్తే.. భారీ ఫైన్ కట్టాల్సి వస్తుంది మరి. ఎందుకంటే ఆదాయపు పన్నుశాఖ ఆధార్ లింక్ చేయని పాన్‌కార్డులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాన్ ఆధార్‌తో లింక్ చేయని వారి ద్వారా ఏదైనా ఆర్థిక లావాదేవీ జరిగితే, వారిపై రూ. 10వేల వరకు జరిమానా విధించవచ్చు.
ఎందుకంటే పన్ను ఎగవేతను ఆపడం, వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం కోసం అదాయపు పన్ను శాఖ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుటోంది. మీ పాన్ కార్డు ఆధార్ తో లింక్ చేయకుండా దాన్ని ఉపయోగిస్తున్నట్టయితే.. మీరు అనేక ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలపై జరిమానా చెల్లించాల్సి రావచ్చు. వీటిలో బ్యాంకు ఖాతాను తెరవడం, బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించడం, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం వంటి సందర్భాల్లో మీకు భారీ ఫైన్ పడే అవకాశం ఉంది. ఈ అన్ని సందర్భాల్లో నిష్క్రియాత్మక పాన్‌ను ఉపయోగిస్తే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద ప్రతి లావాదేవీకి రూ. 10వేల వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. నిర్ణీత గడువులోపు ఇది చేయకపోతే ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీనివల్ల ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించలేరు. అలాగే, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నవారిపై కూడా ఆదాయ పన్నుశాఖ నిఘా ఉంచింది. చెల్లుబాటు లేని పాన్‌లను ఉపయోగించి చేసిన లావాదేవీలను తక్షణమే గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు AI, డేటా విశ్లేషణలను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది మోసగాళ్లను గుర్తించడమే కాకుండా, తప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్‌లు, నకిలీ రీఫండ్ క్లెయిమ్‌లు, పెద్ద లావాదేవీలను కూడా నివారిస్తుంది. ఇంకా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారు వెంటనే దీన్ని చేయాలి. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా దీన్ని ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఇది చేయకపోతే, పాన్‌ను సస్పెండ్ చేయవచ్చు. బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలను స్తంభింపజేయవచ్చు. అలాగే పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం కూడా సాధ్యం కాదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూల్ న్యూస్.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్.. ఫ్లైఓవర్ పై నుంచి దూసుకెళ్లిన కారు.. కట్ చేస్తే

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో

రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత
