Iran-Israel War: మంట అంటుకుంది.. సెగ తాకడమే తరువాయి.. ఉలిక్కిపడ్డ ప్రపంచం!
ఆయిల్ దిగుమతిని అటుంచితే.. భారత ఎగుమతులకు కూడా ఇబ్బందులు తప్పవు. హొర్మూజ్ జలసంధి ద్వారా యూరప్ దేశాలకు సరుకు రవాణా చేస్తోంది భారత్. ఇప్పుడు ఈ మార్గాన్ని మూసేస్తే.. సరుకు గమ్యస్థానాలకు చేరడానికి మరో 20 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. అంటే.. ఒక్కో కంటైనర్‌పై ఏకంగా వెయ్యి డాలర్ల వరకు అదనపు భారం పడుతుంది.

యురేనియం-235ని దాదాపుగా 90 శాతం వరకు శుద్ధి చేసింది ఇరాన్. పరిస్థితి అంతదాకా వచ్చిందంటే అర్థం.. ఇక అణుబాంబును తయారు చేయడం ఒక్కటే మిగిలింది. ఇజ్రాయెల్ భయం కూడా అదే. ఇరాన్‌కు నెలలు, వారాలు, రోజుల గడువు కాదు.. గంటల వ్యవధి కూడా ఇవ్వొద్దనేది ఇజ్రాయెల్ లక్ష్యం. ఆల్రడీ ఇరాన్ దగ్గర హైపర్ సానిక్ మిస్సైల్స్ 40 ఉన్నాయి. మాక్-15 స్పీడ్‌తో దూసుకెళ్తాయి. జస్ట్ 400 సెకన్లలోనే ఇజ్రాయెల్‌ను టచ్ చేస్తుంది ఒక్కో మిస్సైల్. అంటే.. జస్ట్ ఆరు నిమిషాల్లో ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకుతాయి. అంత తక్కువ టైమ్‌లో.. శబ్దం కంటే 15 రెట్ల వేగంతో దూసుకొచ్చే ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడం అసంభవం. ఐరన్ డోమ్, యారో, డేవిడ్ స్లింగ్, పాట్రియాడ్స్, థాడ్.. ఇలా ఇజ్రాయెల్-అమెరికా దగ్గరున్న ఏ ఒక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇరాన్ ప్రయోగించే ఆ మిస్సైల్స్‌ను ఆపలేదు. ఇదంతా జరిగేది ఎప్పుడు? ఇరాన్ దగ్గర అణుబాంబు రెడీ అయినప్పుడు. అంతవరకు చూస్తూ ఊరుకుంటాయేంటి ఇజ్రాయెల్ గానీ, అమెరికా గానీ. ముందే అటాక్ చేస్తాయి. ఇప్పుడు జరగబోయేది కూడా ఎగ్జాక్ట్‌గా అదే. సరే… ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ అటాక్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది? ఈ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిణామం జరగబోతోంది. సామాన్యులకు సైతం సెగ తగిలేంత ప్రభావం పడబోతోంది. ఇంతకీ ఏంటది? ‘అమెరికా, ఇరాక్ కొట్టుకుని మధ్యలో కువైట్ మీద బాంబులు వేసినట్టు’ అనే డైలాగ్ ఉంది ఓ...




