Rule Changes From September 2023: రేపట్నుంచి ఈ రూల్స్ మారుతున్నాయ్.. మీ జేబుకు చిళ్లుపడ్డట్లే!
రేపటి నుంచి సెప్టెంబర్ కొత్త నెల ప్రారంభం కానుంది. 1 సెప్టెంబర్ 2023 నుండి చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. గ్యాస్ సిలిండర్ ధర నుంచి ఉద్యోగుల జీతం, క్రెడిట్ కార్డ్ నియమాల వరకు పలు రకాల మార్పులు చోటు చేసుకోనున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి..

న్యూఢిల్లీ, ఆగస్టు 31: రేపటి నుంచి సెప్టెంబర్ కొత్త నెల ప్రారంభం కానుంది. 1 సెప్టెంబర్ 2023 నుండి చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. గ్యాస్ సిలిండర్ ధర నుంచి ఉద్యోగుల జీతం, క్రెడిట్ కార్డ్ నియమాల వరకు పలు రకాల మార్పులు చోటు చేసుకోనున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే..
ఉద్యోగుల జీతం పెరుగుతుంది
సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగుల వేతన నిబంధనల్లో మార్పులు రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం టేక్ హోమ్ జీతం పెరుగుతుంది. అలాగే రేపటి నుంచి అద్దె రహిత వసతి నిబంధనలలో మార్పులు రానున్నాయి. దీనివల్ల అద్దె ఇంట్లో ఉండే ఉద్యోగులకు, వారి జీతంలో స్వల్ప మినహాయింపు లభిస్తుందన్నమాట.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
సెప్టెంబర్ 1 నుంచి యాక్సిస్ బ్యాంక్ జనిత మాగ్నస్ క్రెడిట్ కార్డ్‌లో మార్పు రాబోతోంది. ఈ మార్పుల తర్వాత కస్టమర్‌లు మునుపటి కంటే తక్కువ రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. అలాగే.. వచ్చే నెల నుంచి కొన్ని లావాదేవీలపై కస్టమర్లు ప్రత్యేక తగ్గింపులను పొందలేరు. దీనితో పాటు వినియోగదారులు 1వ తేదీ నుంచి వార్షిక రుసుమును కూడా చెల్లించాలి.




LPG నుంచి CNG వరకు కొత్త ధరలు రానున్నాయ్..
చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్లు, CNG , PNG ధరలను ప్రతి నెలా మొదటి రోజున సవరిస్తాయనే సంగతి తెలిసిందే. కాబట్టి LPG నుంచి CNG వరకు కొత్త ధరలు ప్రకటించనున్నాయి. ఈసారి CNG-PNG ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
బ్యాంకులకు 16 రోజులు మూసివేత
సెప్టెంబర్ నెలలో పూర్తిగా 16 రోజులు బ్యాంక్లకు సెలవులు ఉంటాయి. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుని తర్వాత మాత్రమే బ్యాంక్ పనులు ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్‌బీఐ ప్రతి నెలా ప్రచురిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల ప్రకారం మారుతూ ఉంటాయి.
ఐపీవో లిస్టింగ్ రోజులు తగ్గుతాయి
సెబీ IPO లిస్టింగ్ విషయంలో పెద్ద నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఐపీఓ లిస్టింగ్ రోజులను సెబీ తగ్గించబోతోంది. స్టాక్ మార్కెట్లలో షేర్ల లిస్టింగ్ కాల పరిమితిని సగానికి అంటే దాదాపు మూడు రోజులకు తగ్గించారు. సెబీ ప్రకారం.. ఐబీవో ముగిసిన తర్వాత సెక్యూరిటీల లిస్టింగ్ కోసం పట్టే సమయాన్ని 6 పనిదినాల నుంచి మూడు పని రోజులకు తగ్గించాలని నిర్ణయించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.