Education Loan: మీరు ఎడ్యూకేషన్ లోన్ తీసుకుంటున్నారా? అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోండి..
Education Loan Return Policy: ఈ దునియాలో జీవితం నెగ్గుకురావాలంటే జేబులో తప్పకుండా డబ్బులు ఉండాల్సిందే. లేదంటే ఏ పని కూడా చేయలేదు. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం.. డబ్బులు లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు తమ చదవును మధ్యలోనే నిలిపేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే.. విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో.. ప్రభుత్వాలు, బ్యాంకులు వారికి రుణాలను అందిస్తున్నాయి. డబ్బులు లేక చదువును నిలిపివేయడం కంటే..

Education Loan Return Policy: ఈ దునియాలో జీవితం నెగ్గుకురావాలంటే జేబులో తప్పకుండా డబ్బులు ఉండాల్సిందే. లేదంటే ఏ పని కూడా చేయలేదు. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం.. డబ్బులు లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు తమ చదవును మధ్యలోనే నిలిపేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే.. విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో.. ప్రభుత్వాలు, బ్యాంకులు వారికి రుణాలను అందిస్తున్నాయి. డబ్బులు లేక చదువును నిలిపివేయడం కంటే.. ఎడ్యూకేషన్ లోన్ తీసుకుని, ఉన్నత చదువులు చదవడం ఉత్తమం. అయితే, ఇతర లోన్‌ల మాదిరిగానే.. ఎడ్యూకేషన్ లోన్‌కు కూడా చాలా నియమాలు వర్తిస్తాయి. వాటిని జాగ్రత్తగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. లోన్ తీసుకున్నదాని కంటే ఎక్కువ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఎడ్యూకేషన్ లోన్.. స్టడీ, రాబడి సహా అనేక అంశాలపై ఆధార పడి ఉంటుంది. ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కొన్ని ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ సమాచారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వడ్డీ రేట్లు తప్పక తెలుసుకోవాలి..
ఏ రకమైన లోన్ అయినా.. వడ్డీ చెల్లించాల్సిందే. అయితే, వడ్డీ ఎంత అనేది బ్యాంకులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే మీరు రూ. 3 లక్షలు రుణం తీసుకుంటే.. తిరిగి చెల్లించే మొత్తం బ్యాంకులు విధించే వడ్డీపై ఆధారపడి ఉంటుంది. తక్కువ వడ్డీ లభించే చోట రుణాలు తీసుకోవడం చాలా ఉత్తమం. 8 నుండి 11 శాతం వరకు లేదా దానికి దరిదాపులో ఉన్న వడ్డీ శాతంతో ఎడ్యూకేషన్ లోన్ తీసుకోవడం ఉత్తమం. అలాగే, మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తుందో కూడా తెలుసుకోవడం ముఖ్యం. కొన్ని బ్యాంకులు ఎడ్యూకేషన్ లోన్‌కి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయవు. ఇది బ్యాంకులను బట్టి ఉంటుంది.
ఎంత మొత్తం చెల్లించాలి..
ఎడ్యుకేషన్ లోన్ కాలిక్యులేటర్ ప్రకారం.. మీరు బ్యాంకుకు మొత్తం ఎంత డబ్బు చెల్లించాలి, అసలు మీకు ఎంత మొత్తం డబ్బు వస్తుంది అనేది ముందుగానే తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌లో ఎడ్యూకేషన్ లోన్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. దాని ఆధారంగా మీరు ఎంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఎంత వడ్డీ, ఈఎంఐ ఎంత? అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు, ఎన్ని సంవత్సరాలకు రుణం తీసుకుంటున్నారు వంటి వివరాలను నమోదు చేస్తే ఫుల్ డీటెయిల్స్ అక్కడ మనం చూడొచ్చు.
నిబంధనలు బ్యాంకుపై ఆధారపడి ఉంటాయి..
బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లు, వాటి విద్యా రుణ విధానాన్ని కలిగి ఉంటాయి. మీరు ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారో అందులోంచి ముందుగానే సమాచారాన్ని సేకరించాలి. మన దేశంలో నర్సరీ నుండి పీజీ వరకు, విదేశాలలో పరిశోధన, ఉన్నత చదువు కోసం రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం బ్యాంకు ప్రకారం రుణ విధానం ఉంటుంది. ఒక సంవత్సరం నుండి 15 సంవత్సరాల వరకు రుణం తీసుకోవచ్చు.
తక్కువ వడ్డీకి విద్యా రుణాన్ని అందించే కొన్ని బ్యాంకులు ఉన్నాయి. వాటిలో ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైనవి. మెరిటోరియస్ విద్యార్థులు, మహిళా విద్యార్థులు మొదలైన కొందరు ప్రత్యేక అభ్యర్థులు కూడా అదనపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..