Gold Price: పసిడి ధరలకి రెక్కలొచ్చాయ్.. అందనంత ఎత్తులో ఎగిరిపోతోంది..

బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి విలువ కలిగి ఉంటుంది. వీటి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేరు. బంగారం ధరలు మన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ గత రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price: పసిడి ధరలకి రెక్కలొచ్చాయ్.. అందనంత ఎత్తులో ఎగిరిపోతోంది..
18th November 2023 Gold And Silver Price In Hyderabad Vijayawada Delhi Mumbai Chennai
Follow us
Srikar T

|

Updated on: Nov 18, 2023 | 6:46 AM

బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి విలువ కలిగి ఉంటుంది. వీటి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ చెప్పలేరు. బంగారం ధరలు మన్నటి వరకూ తక్కువగా ఉన్నప్పటికీ గత రెండు రోజుల్లో అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 61,040 కాగా ఈరోజు రూ.61,690 కి చేరుకుంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 55,950 ఉండగా ఈరోజు రూ.56,550 కి ఎగబాకింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. నవంబర్ మొదటి వారం తరువాత 10గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ.60,630 ఉండగా రెండవ వారం వచ్చే సరికి 61,690కి చేరుకుంది. అదే 10గ్రాములు 22క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. నవంబర్ మొదటి వారం తరువాత రూ.55,550 ఉండగా ప్రస్తుతం రూ. 56,550కి చేరుకుంది. కేవలం వారం వ్యవధిలోనే రూ.1000కి పైగా పెరగడంతో స్వర్ణాభరణాలు కొనుగోలుదారులకు నిరాశను కలిగిస్తోంది. ఇక వెండి విషయానికొస్తే నిన్నమన్నటి వరకూ 76వేల వద్ద ఉన్న ధరలు.. ఏకంగా 79,500 కి చేరింది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 61,690
  • విజయవాడ..రూ. 61,690
  • ముంబాయి..రూ. 61,690
  • బెంగళూరు..రూ.61,690
  • చెన్నై..రూ. 62,180

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 56,550
  • విజయవాడ..రూ. 56,550
  • ముంబాయి..రూ. 56,550
  • బెంగళూరు..రూ. 56,550
  • చెన్నై..రూ.57,000

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 79,500
  • విజయవాడ..రూ. 79,500
  • చెన్నై..రూ.79,500
  • ముంబాయి..రూ. 76,500
  • బెంగళూరు..రూ. 75,500

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..