Cars Production: వచ్చే ఏప్రిల్ నుంచి ఆ 17 కార్ల తయారీ బంద్.! కారణం తెలిస్తే షాక్ అవుతారు!
కొత్త సంవత్సరం వస్తుందంటే అన్నింటా జోష్ కనిపిస్తుంది. చాలా మంది కొత్త రిసల్యూషన్స్ తీసుకుంటారు. మరికొంత మంది కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.

కొత్త సంవత్సరం వస్తుందంటే అన్నింటా జోష్ కనిపిస్తుంది. చాలా మంది కొత్త రిసల్యూషన్స్ తీసుకుంటారు. మరికొంత మంది కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. బైక్ లు, ఇళ్లు, కార్లు, వంటివి వాటి కోసం ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారు. అయితే వచ్చే 2023 సంవత్సరం కార్ల కొనుగోలుదారులకు షాక్ ఇవ్వనుంది. దాదాపు అన్ని దిగ్గజ కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచనున్నాయి. దీంతో పాటు కొన్ని కంపెనీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని మోడళ్ల తయారీని ఆయా కంపెనీలు నిలిపివేయనున్నాయి. వీటిలో మారుతి సుజుకీ, టాటా, మహీంద్ర, హ్యూండాయ్, హోండా వంటి కంపెనీకి చెందిన కార్లు కూడా ఉన్నాయి. అసలు దీనికి కారణం ఏంటి? ఏయే కార్లు ఇక మనకు కనిపించవు? ఓ సారి చూద్దాం..
ఎందుకంటే..
వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 17 కార్ల ఉత్పత్తిని 2023 ఏప్రిల్ నుంచి నిలిపివేయనున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన రియల్ డ్రైవింగ్ ఎమిసన్(ఆర్డీఈ) నిబంధనలు. దీని ప్రకారం ఆయా కంపెనీలు వచ్చే ఏప్రిల్ నుంచి వాటి ఉత్పత్తిని నిలిపివేయనున్నాయి.
ఆర్డీఈ నిబంధనలు ఏమిటి?
రియల్ డ్రైవింగ్ ఎమిసన్(ఆర్డీఈ) ని బీఎస్ 6 ఎమిషన్ నియమాలలో ఫేజ్ 2 కింద చూడవచ్చు. దీని ప్రకారం ప్రతి వాహనంలో నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలను నిర్దారించేందుకు సెల్ఫ్ డయాగ్నోస్టిక్ పరికరం కచ్చితంగా ఉండాలి. ఈ పరికరం నిరంతరం వాహనం నుంచి వెలువడే ఉద్గారాలను పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూ ఉంటుంది. ఈ పరికరంలో కాటలిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్స్ వంటివి కలిగి ఉంటాయి.
పాత మోడళ్లకు వచ్చిన నష్టం ఏమిటి?
ఈ ఆర్డీఈ పరికరాన్ని పాత తరహా వాహనాల్లో ఇన్ స్టాల్ చేయాలంటే ఇంజిన్ తో పాటు చాలా కీలక భాగాలు అప్ గ్రేడ్ చేయాల్సి వస్తోంది. దీనికి భారీగా ఖర్చవుతుంది. ఇది ఎంతంటే మరొక కొత్త ఇంజిన్ తయారు చేసినా అంత ఖర్చు కాదని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు డీజిల్ ఇంజిన్ వాహనాలను కంపెనీల ఉత్పత్తిని వచ్చే 2023 ఏప్రిల్ నుంచి నిలిపివేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆ కార్లు ఇవే..
– మాహీంద్ర మరాజ్జో
– మహీంద్ర ఆల్టురాస్ జీ4
– మహీంద్ర కేయూవీ 100
– స్కోడా ఓక్టావియా
– స్కోడా సూపర్బ్
– రినాల్ట్ క్విడ్ 800
– నిస్సాన్ కిక్స్
– మారుతీ సుజుకి ఆల్ట్రో 800
– టోయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్
– హ్యూందాయ్ ఐ 20 డీజిల్
– హ్యూందాయ్ వెర్నా డీజిల్
– హోండా సిటీ ఫోర్త్ జెన్
– హొండా సిటీ ఫివ్త్ జెన్ డీజిల్
– హొండా అమేజ్ డీజిల్
– హోండా జాజ్
– హోండా డబ్ల్యూ – వీ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి