2021 బడ్జెట్.. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఎంతవరకు ఉపశమనం లభించనుంది.. నిపుణులెమంటున్నారు ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021 బడ్జె్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అటు పరిశ్రమలు, ఆటో మొబైల్ ఇండస్ట్రీలు,

  • Rajitha Chanti
  • Publish Date - 6:07 pm, Tue, 19 January 21
2021 బడ్జెట్.. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఎంతవరకు ఉపశమనం లభించనుంది.. నిపుణులెమంటున్నారు ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021 బడ్జె్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అటు పరిశ్రమలు, ఆటో మొబైల్ ఇండస్ట్రీలు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీతోపాటు మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు కూడా రెట్టింపు ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇక పన్ను చెల్లింపులో ఏదైనా మినహాయింపు ప్రకటిస్తారా ? లేదా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వారి సందేహాలను అదునుగా ప్రముఖ వార్త సంస్థ ఐఎఎన్ఎస్ కూడా ఈసారి బడ్జెట్‏లో మధ్యతరగతికి కేంద్రం కాస్త ఉపశమనం కల్పించనున్నట్లుగా ప్రచురించింది. ఇక దేశవ్యాప్తంగా ఈ కరోనా మహామ్మారి వలన ఎదురైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పన్ను భారాన్ని తగ్గించడానికి యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఇస్తూ కేంద్రం ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు రెట్టింపు చేయనున్నట్లుగా అంచనా. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఆదాయం పై ఎలాంటి పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వచ్చే ఆదాయానికి 5 శాతం పన్ను విధించబడుతుంది. అయితే 2019 బడ్జెట్‏లో ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీని ప్రకారం రూ.5 లక్షల వరుక ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు సున్నా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రాథమిక మినహాయింపు పరిమితిని కూడా రూ.5 లక్షలకు వరకు మాత్రమే కల్పించారు.

2020లో ప్రకటించిన కొత్త పన్ను విధానం..
గతేడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‏లో కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ప్రకటించింది. అందులో పన్ను మినహాయింపు పూర్తిగా రద్దు చేసింది. అలాగే పన్ను స్లాబ్‏ను కూడా 6 భాగాలుగా విభజించారు. ఇందులో 5 శాతం, 10 శాతం, 15 శాతం, 20 శాతం, 25 శాతం మరియు 30 శాతం. ఇక సున్నా నుంచి రూ.2.5 లక్షల వరకు ఆదాయం పై పన్ను రేటును సున్నా శాతంగా నిర్ణయించింది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పన్ను రేటును 5 శాతం ఉండగా.. ఇక ప్రస్తుత బడ్జెట్లో మినహాయింపు విడుదల చేస్తుందా లేదా అనేది చూడాలి.

రూ.50 వేలు ప్రాథమిక మినహాయింపు..
2019 బడ్జెట్‏లో ప్రామాణిక తగ్గింపును రూ.40 వేల నుంచి 50 వేలకు పెంచారు. నిజానికి 2018 బడ్జెట్‏లో 40 వేల ప్రామాణిక తగ్గింపును జీతం పొందిన తరగతికి ఉపశమనం ఇస్తున్నట్లుగా ప్రకటించింది కేంద్రం. అలాగే రవాణా చార్జీల కింద 19200 రూపాయలకు బదులుగా, వైద్యానికిగానూ.. రూ.15,0000 రద్దు చేసింది. అంటే రూ.5800 ఉపశమనం లభించించి. 2019 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రకటించింది కేంద్రం. దీని పరిమితిని రూ.50 వేల వరకు పెంచారు.

రెవెన్యూ శాఖ పరంగా..
ప్రస్తుత పరిస్థితులలో పెరుగుతున్న డిమాండ్ పరంగా ఈసారి బడ్జెట్లో మినహాయింపు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే విషయం గురించి రెవెన్యూ శాఖను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అలాగే పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రూ.50 వేల నుంచి పెంచవచ్చు.

ఆరోగ్య భీమాలో ఉపశమనం..
కరోనా వైరస్ కారణంగా వైద్య భీమా సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే ప్రీమియం చార్జ్ కూడా పెరిగింది. వైద్య భీమాపై మినహాయింపును తొలగించడం ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రామాణిక మినహాయింపును అమలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య భీమా కోసం పెరుగుతున్న డిమాండ్ పరంగా ఇందులో ఉపశమనం కల్పించనున్నట్లుగా అంచనా. ఈసారి బడ్జెట్లో ప్రామాణిక తగ్గింపు పరిమితిని కూడా రూ.75వేలు లేదా రూ.1 లక్ష వరకు పెంచే అవకాశం ఉండనుంది.

నూతన ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టనున్న ప్రభుత్వం..
ఇక కరోనా వలన ఏర్పడిన ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిని అధిగమించడానికి ప్రభుత్వం కొత్త మార్గాలను వెతుకుతోంది. ఈసారి స్పెక్ట్రం వేలంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూ.3.92 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను మూలధర వద్ద వేలం వేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గంలో గత నెలలో ఆమోదం తెలిపింది. టెలీకాం కంపెనీలు ఈ వేలంలో పాల్గొనడానికి ఫిబ్రవరి 5లోగా తమ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా పీఎస్‏యూ, నాన్ కోర్ ఆస్తులను కూడా విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ కూడా ప్రారంభించనుంది. ఇక వీటి ద్వారా ప్రభుత్వం కనీసం 10వేల కోట్ల వరకు నిధులను సేకరించనుంది.