AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget-2021: ఈ సారి ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్.. పెట్టుబడిదారులకు మరింత విశ్వాసం పెంచనున్న బడ్జెట్‌

Budget-2021: ఫిబ్రవరి 1న కేంద్రం 2021 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌. అయితే బడ్జెట్‌ 2021

Budget-2021: ఈ సారి ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్.. పెట్టుబడిదారులకు మరింత విశ్వాసం పెంచనున్న బడ్జెట్‌
Subhash Goud
|

Updated on: Jan 19, 2021 | 6:02 PM

Share

Budget-2021: ఫిబ్రవరి 1న కేంద్రం 2021 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌. అయితే బడ్జెట్‌ 2021 ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. ఒక వైపు మొదటి సారి డిజిటల్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతుండగా, మరో వైపు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను బట్టి ఈ బడ్జెట్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ కొన్ని ముఖ్యమైన ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద ఈ సారి బడ్జెట్‌ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందని, తద్వారా పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారు. స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్ల నుంచి పొందిన డివిడెండ్లు ఇంతకు ముందు పన్ను రహితంగా ఉండేవి. కానీ గత బడ్జెట్‌లో పన్ను నికర పరిధిలోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం అన్ని రకాల డివిడెండ్లకు పన్ను ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది పెట్టుబడి దారులు నష్టపోయారు.

దీర్ఘకాలిక మూలధన లాభాలు మూడు సంవత్సరాల క్రితం వరకు పన్ను రహితంగా ఉండేవి. కానీ ఇప్పుడు లక్ష రూపాయలకుపైగా 10శాతం పన్ను ఉంది. పెట్టుబడిదారులకు ఉపశమనం కలిగించడానికి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును పూర్తిగా రద్దు చేయాలి.. లేదా దాని పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలి.

వేర్వేరు పెట్టుబడులపై వేరే పన్ను విధించడం మంచిది. పెట్టుబడి అనేది పన్నుగా ఉండాలి. దీర్ఘకాలిక మూలధన లాభాల లెక్కింపు వంటివి ఏకరీతిగా ఉండాలి.  ప్రస్తుతం స్టాక్‌లకు సంవత్సరం రియల్‌ ఎస్టేట్‌కు రెండు సంవత్సరాలు, డీప్‌, డెట్‌ ఫండ్లకు మూడు సంవత్సరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి పన్ను లెక్క కూడా భిన్నంగా ఉంటుంది. బంగారు అభరణాలు, నాణేలు, బంగారు కడ్డీలపై ఎల్‌టీజీసీ 20 శాతం ఉంది. మెచ్యూరిటీ వరకు గోల్డ్‌ బాండ్‌ పన్ను రహితంగా ఉంటుంది. అయితే మెచ్యూరిటీకి ముందు అమ్మడం కూడా పదిశాతం పన్ను మాత్రమే. చివరగా డివిడెండ్లపై పన్నును తొలగించడం, హోల్డింగ్‌ పీరియడ్‌ తేడాలు, వ్యత్యాసాలను పరిష్కరించడం పెట్టుబడిదారులలో కొత్త విశ్వాసాన్ని కలిగించడం వంటివి ఈ బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో వారు ఎక్కువ పెట్టుబడులు పెట్టగలుగుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..