అరుణాచల్ ప్రదేశ్ లో ఏడాదిలో చైనా నిర్మించిన గ్రామం, శాటిలైట్ ఫొటోలే నిదర్శనం, నిర్ధారించిన విదేశాంగ శాఖ

అరుణాచల్ ప్రదేశ్ లో ఒకే ఒక ఏడాదిలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించింది. సుమారు 100 ఇళ్ళు, విశాలమైన రోడ్లు శాటిలైట్ ఇమేజీల్లో..

  • Umakanth Rao
  • Publish Date - 5:00 pm, Tue, 19 January 21
అరుణాచల్ ప్రదేశ్ లో ఏడాదిలో చైనా నిర్మించిన గ్రామం, శాటిలైట్ ఫొటోలే నిదర్శనం, నిర్ధారించిన విదేశాంగ శాఖ

అరుణాచల్ ప్రదేశ్ లో ఒకే ఒక ఏడాదిలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించింది. సుమారు 100 ఇళ్ళు, విశాలమైన రోడ్లు శాటిలైట్ ఇమేజీల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత భూభాగంలో 4.5 కి.మీ. దూరం మేరా ఈ విలేజ్ నిర్మితమైంది. భారత-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎగువ సుబాన్ సిరి జిల్లాలో ‘సారీ చూ’ నదీ తీరంలో ఇది కనబడుతోంది. 2019 ఆగస్టులో ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోయినప్పటికీ ఈ సంవత్సరం నవంబరు నాటికి ఇది ప్రత్యక్షమైంది.  ఈ గ్రామం స్పష్టంగా భారత భూభాగంలోనే ఉందని ప్రభుత్వం తన అధికారిక మ్యాప్ ను వినియోగించే ఆన్ లైన్ మ్యాప్ (సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా) చూపుతోంది. ఈ గ్రామ నిర్మాణం నిజమేనని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, మన దేశ సార్వభౌమాధికారాన్ని. ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని పేర్కొంది.

అరుణాచల్ లో వెలసిన  చైనా గ్రామం మీద పత్రికల్లో శాటిలైట్ ఫొటోలతో సహా వార్తలు వచ్చినా భారత విదేశాంగ శాఖ మంత్రి గానీ, రక్షణ శాఖ మంత్రిగానీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.