చెన్నైలో జిన్ పింగ్.. ఇమ్రాన్ ఏం చేశాడంటే..?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో కాలుమోపిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ పరిణామాలపై మీడియా కవరేజ్‌ సవ్యంగా లేదని ఇమ్రాన్‌ తప్పుపట్టారు. హాంకాంగ్‌ నిరసనలకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్న విదేశీ మీడియా కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను విస్మరిస్తోందని దుయ్యబట్టారు. హాంకాంగ్‌ నిరసనలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్న అంతర్జాతీయ మీడియా జమ్ము కశ్మీర్‌లో యదేచ్ఛగా సాగుతున్న మానవ హక్కుల ఉ‍ల్లంఘనలను ఎలా విస్మరిస్తోందో తనకు […]

చెన్నైలో జిన్  పింగ్.. ఇమ్రాన్ ఏం చేశాడంటే..?
Follow us
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 11, 2019 | 3:54 PM

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో కాలుమోపిన నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ పరిణామాలపై మీడియా కవరేజ్‌ సవ్యంగా లేదని ఇమ్రాన్‌ తప్పుపట్టారు. హాంకాంగ్‌ నిరసనలకు విశేష ప్రాచుర్యం కల్పిస్తున్న విదేశీ మీడియా కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను విస్మరిస్తోందని దుయ్యబట్టారు.

హాంకాంగ్‌ నిరసనలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్న అంతర్జాతీయ మీడియా జమ్ము కశ్మీర్‌లో యదేచ్ఛగా సాగుతున్న మానవ హక్కుల ఉ‍ల్లంఘనలను ఎలా విస్మరిస్తోందో తనకు అర్థం కావడం లేదంటూ ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రాంతాన్ని భారత్‌ తన దళాల గుప్పిట్లో పెట్టుకుని 80 లక్షల కశ్మీరీల గొంతు నొక్కుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై విమర్శలు గుప్పిస్తూ అంతర్జాతీయ వేదికలపై రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ కు అనుకూలంగా అంతర్జాతీయ వేదికల మీద వ్యవహరించిన చైనా.. తమ అధ్యక్షుడు జెన్ పింగ్ భారత్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది.

ఐక్యరాజ్యసమితి భేటీలో క శ్మీర్ అంశాన్ని లేవనెత్తిన చైనా ఇపుడు మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించకుండా తమ అధ్యక్షుని భారత్ పర్యటన సానుకూలంగా సాగిపోవాలని  కోరుకుంటోంది. ఎందుకంటే చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్దం జరుగుతున్న తరుణంలో భారత్ మార్కెట్ చైనాకు అత్యంత అవసరం. వాణిజ్య ఒప్పందాలు చేసుకునే క్రమంలో కాశ్మీర్ అంశానికి డ్రాగన్ దేశం ఇపుడు పెద్దగా ప్రాధాన్యతనివ్వడం లేదన్నది నిర్వివాదాంశం.