కొడాలి వంగవీటి భేటీ

ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీలో వలసలు, బుజ్జగింపులు, ఎన్నికల వ్యూహాలతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఆసక్తికరపరిణామం చోటుచేసుకుంది. ఈ మధ్యే వైసీపీకి రాజీనా చేసిన వంగవీటి రాధాకృష్ణ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని కలవడం ఆసక్తికరంగా మారింది. రాధా తన సన్నిహితులతో కలిసి నానితో భేటీ అయ్యారు. గుడివాడలోని ఏలూరు రోడ్డులో ఉన్న ఫర్నీచర్ పార్క్‌లో ఈ భేటీ జరిగింది. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేను […]

కొడాలి వంగవీటి భేటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2019 | 3:55 PM

ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీలో వలసలు, బుజ్జగింపులు, ఎన్నికల వ్యూహాలతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఆసక్తికరపరిణామం చోటుచేసుకుంది. ఈ మధ్యే వైసీపీకి రాజీనా చేసిన వంగవీటి రాధాకృష్ణ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని కలవడం ఆసక్తికరంగా మారింది. రాధా తన సన్నిహితులతో కలిసి నానితో భేటీ అయ్యారు.

గుడివాడలోని ఏలూరు రోడ్డులో ఉన్న ఫర్నీచర్ పార్క్‌లో ఈ భేటీ జరిగింది. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వైసీపీలో ఉన్నప్పుడు రాధా, నానిలు మంచి స్నేహితులు. ఆ సన్నిహితంతోనే కలిశారనే ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు వంగవీటితో నాని చర్చలు జరపడం కూడా చర్చనీయాంశంగా మారింది.