ఈపీఎఫ్‍ ఖాతాదారులకు శుభవార్త‌

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తాజాగా తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఇకపై జాబ్ మారిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) క్లెయిమ్స్‌ బదిలీ కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) ఉన్నప్పటికీ ఉద్యోగి జాబ్ మారితే ఈపీఎఫ్‌ క్లెయిమ్స్‌ బదలాయింపునకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ ఉండదు. ఉద్యోగి ఉద్యోగం మారిన […]

ఈపీఎఫ్‍ ఖాతాదారులకు శుభవార్త‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2019 | 2:00 PM

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తాజాగా తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఇకపై జాబ్ మారిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎంప్లాయీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) క్లెయిమ్స్‌ బదిలీ కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది.

ప్రస్తుతం యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌) ఉన్నప్పటికీ ఉద్యోగి జాబ్ మారితే ఈపీఎఫ్‌ క్లెయిమ్స్‌ బదలాయింపునకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ ఉండదు. ఉద్యోగి ఉద్యోగం మారిన వెంటనే ఈపీఎఫ్‌ కూడా ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుందని కార్మిక శాఖ తెలిపింది.

ఈపీఎఫ్‌వోకు ఏటా దాదాపు 8 లక్షల ఈపీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ క్లెయిమ్స్‌ వస్తున్నాయి. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు మారిన వెంటనే ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్‌ బదిలీని ఈపీఎఫ్‌వో చేపడుతోంది. ఇకపై ఉద్యోగికి జీవితాంతం ఒకే యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్) పై అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.