నేటి నుంచి హైదరాబాద్‌ రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులు

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వాడుతోన్న కాలుష్య రహిత‌ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ట్రయల్ రన్స్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ బస్సులను మంగళవారం సాయంత్రం మియాపూర్-2 డిపో నుంచి లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ బస్సులను నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోల నుంచి 10 బస్సుల చొప్పున […]

నేటి నుంచి హైదరాబాద్‌ రోడ్లపైకి ఎలక్ట్రిక్ బస్సులు
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2019 | 11:39 AM

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వాడుతోన్న కాలుష్య రహిత‌ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ట్రయల్ రన్స్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ బస్సులను మంగళవారం సాయంత్రం మియాపూర్-2 డిపో నుంచి లాంఛనంగా ప్రారంభించనుంది.

ఈ బస్సులను నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోల నుంచి 10 బస్సుల చొప్పున శంషాబాద్ విమానాశ్రయం రూట్లలో నడపనున్నారు. విమానాశ్రయంలో గ్రేటర్ ఆర్టీసీ వీటిని ఆపరేట్ చేయనుంది. ప్రస్తుతం వ‌సూలు చేస్తోన్న ఏసీ బస్సుల చార్జీలనే ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి ఇతర రూట్లలోనూ ఈ బస్సులను నడిపే అవకాశాలను పరిశీలిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా మియాపూర్-2, కంటోన్మెంట్ డిపోలలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఒక బస్సును 4 గంటలు చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్లు వరకు తిరుగుందని తెలిపారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!