AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్ఎస్ నేషనల్ రికార్డు.. దరిదాపుల్లో ఏ పార్టీ లేదు

తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో ఓ రికార్డు సృష్టించింది. గులాబీ దళం నేషనల్ రికార్డు సాధించింది. తాజా మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం తేటతెల్లమైంది. ఇంతకీ టీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ కొత్త రికార్డు ఏంటి? తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విధంగా ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 120 మునిసిపాలిటీల్లో 109 మునిసిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే 91 శాతం మునిసిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ సాధించింది. […]

టీఆర్ఎస్ నేషనల్ రికార్డు.. దరిదాపుల్లో ఏ పార్టీ లేదు
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 25, 2020 | 7:40 PM

Share

తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో ఓ రికార్డు సృష్టించింది. గులాబీ దళం నేషనల్ రికార్డు సాధించింది. తాజా మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం తేటతెల్లమైంది. ఇంతకీ టీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ కొత్త రికార్డు ఏంటి?

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విధంగా ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 120 మునిసిపాలిటీల్లో 109 మునిసిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే 91 శాతం మునిసిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ సాధించింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోను, ఏ పార్టీ సైతం ఇప్పటి వరకు సాధించని విజయమిది. అధికారపార్టీగా ఎంతో కొంత సానుకూల పరిస్థితి వుంటుంది. కానీ, ఈ స్థాయిలో 90 శాతం కంటే మించిన సీట్లను ఒక పార్టీ గెలుచుకోవడం మాత్రం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

అటు కార్పొరేషన్లలోను మొత్తం పది నగర పాలక సంస్థలు తెలంగాణలో వుంటే.. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలను పక్కన పెడితే.. మిగిలిన తొమ్మిది కార్పొరేషన్లకు గాను ఏడింటిని తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. అంటే సుమారు 77 శాతం సీట్లను టీఆరఎస్ గెలుచుకుందన్నమాట. దేశంలో వందలాది పార్టీలుండగా.. వాటిలో అధికారంలోకి వచ్చిన, వచ్చే పార్టీలతో పోలిస్తే.. టీఆర్ఎస్ రికార్డు అనితర సాధ్యమని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.

బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు