టర్కీని వణికించిన భూకంపం.. 20 మంది మృతి.. వందలాదిమందికి గాయాలు

టర్కీని భూకంపం వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపానికి 20 మంది మరణించగా దాదాపు 600 మందికి పైగా గాయపడ్డారు. రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతగా దీన్ని గుర్తించారు.రాజధాని అంకారాకు సుమారు 340మైళ్ళ దూరంలోని ఎలాజిజ్ ప్రావిన్స్ తో బాటు మలట్యా, గెజిస్ వంటి నగరాల్లో  తీవ్ర ప్రాణ,  ఆస్తి, నష్టం జరిగింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. యుధ్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నారు. తమ ఇళ్ళు తీవ్రంగా దెబ్బ తినడంతో […]

టర్కీని వణికించిన భూకంపం.. 20 మంది మృతి.. వందలాదిమందికి గాయాలు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2020 | 11:43 AM

టర్కీని భూకంపం వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపానికి 20 మంది మరణించగా దాదాపు 600 మందికి పైగా గాయపడ్డారు. రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతగా దీన్ని గుర్తించారు.రాజధాని అంకారాకు సుమారు 340మైళ్ళ దూరంలోని ఎలాజిజ్ ప్రావిన్స్ తో బాటు మలట్యా, గెజిస్ వంటి నగరాల్లో  తీవ్ర ప్రాణ,  ఆస్తి, నష్టం జరిగింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. యుధ్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నారు.

తమ ఇళ్ళు తీవ్రంగా దెబ్బ తినడంతో వేలాది ప్రజలు నిరాశయులయ్యారు. భూకంప తాకిడికి అనేక  భవనాలు రెండుగా చీలిపోయాయి. శిథిలాల్లో చిక్కుకుపోయిన అనేకమందిని బయటికి తీసి రక్షించేందుకు సహాయకబృందాలు శ్రమిస్తున్నాయి. క్షణాల్లో కుప్పకూలిన ఎత్తయిన కట్టడాలు జరిగిన బీభత్సానికి సాక్షిగా నిలిచాయి. టర్కీకి పొరుగునే ఉన్న గ్రీస్ దేశం అవసరమైతే రెస్క్యూ బృందాలను పంపుతామని ప్రకటించింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు యుధ్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ ఎర్డోగాన్ వెల్లడించారు.