కొడుకు దుబాయి వెళ్లాడు.. కోడలు విలన్‌గా మారిపోయింది.. 15రోజులుగా గేటు బయట వృద్ధ దంపతుల పడిగాపులు..!

తెలుగు సీరియళ్లలో కనిపించే దృశ్యం ఆవిష్కృతమైంది.. అత్తామామను కంటికిరెప్పలా చూడాల్సిన కోడలు కాఠిన్యంతో బయటకు వెళ్లగొట్టింది.

కొడుకు దుబాయి వెళ్లాడు.. కోడలు విలన్‌గా మారిపోయింది.. 15రోజులుగా గేటు బయట వృద్ధ దంపతుల పడిగాపులు..!
An Elder Couple Standing In Front Of A Locked House
Follow us

|

Updated on: Mar 28, 2021 | 8:28 AM

elderly couple in Chittoor: తెలుగు సీరియళ్లలో కనిపించే దృశ్యం ఆవిష్కృతమైంది.. అత్తామామను కంటికిరెప్పలా చూడాల్సిన కోడలు కాఠిన్యంతో బయటకు వెళ్లగొట్టింది. భర్త విదేశాలకు వెళ్లగానే అత్తమామల్ని ఇంట్లో నుంచి గెంటేసిందా కోడలు. వృద్ధులైన అత్తామామలు 15 రోజుల నుంచి గేటు దగ్గరే పడి ఉన్నా.. ఆ కోడలి మనసు కరగడం లేదు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరిని కలచివేసింది.

చంద్రగిరి మండలం బి. కొంగరవారిపల్లి గ్రామం.. అబ్బూరి ప్రభాకర్‌, మునెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు. కూలి పనులు చేసే దంపతులు కూతుళ్లిద్దరికీ పెళ్లి చేశారు. కొడుకు చిరంజీవిని బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా పంపారు. దుబాయ్‌లో ఉద్యోగం వచ్చిన కొన్ని రోజుల తర్వాత.. పెళ్లి చేశారు. పెళ్లయ్యాక దుబాయ్ వెళ్లిన యంగ్ కపుల్.. ఐదేళ్లు అక్కడ బాగానే కాపురం చేశారు.

ఇదిలావుంటే, భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏడాది క్రితం ఇరువురు దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. రెండు కుటుంబాల పెద్దలు నచ్చజెప్పినా తీరు మారలేదు. తనపై దాడి చేశారని.. భర్త చిరంజీవితో పాటు అత్తమామల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది చిరంజీవి భార్య. పోలీసులు కేసు నమోదు చేసి కల్పన భర్త, అత్తమామల్ని జైలుకు పంపారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ముగ్గురుకీ బెయిల్ వచ్చింది. కల్పన భర్త దుబాయ్‌ వెళ్లాడు. భర్త దుబాయ్ వెళ్లాక.. నా బతుకేంటని కల్పన అత్తమామల్ని నిలదీసింది. కేసు కోర్టులో ఉండటంతో తాము ఏమీ చేయలేమన్నారు.

అయితే, ఈనెల 14న అత్తింటికి వచ్చిన కోడలు పుట్టింటివారు, బంధువులతో కలిసి ఆ ఇద్దరు వృద్ధులను బలవంతంగా బయటకు నెట్టేసి ఇంటికి తాళం వేసింది. ఆ తర్వాత గ్రామంలో జరిగిన పెద్దల మధ్యవర్తిత్వంతో కోడలు తాళం తీసినా… రెండు రోజుల క్రితం మళ్లీ తాళం వేసింది. ఇలా తరచూ ఇంటికి తాళం వేస్తుంటే తాము ఎక్కడ ఉండాలని ఆ వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. కోడలు తాళం వేసినప్పుడల్లా… ఇంటి ముందే పడిగాపులు కాస్తున్నారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారా దంపతులు.

Read Also… ఏపీలో రక్తమోడిన రహదారులు.. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. 11మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రలు

Latest Articles