మీరు లవ్‌‌లో ఉన్నారా..! ఎలా ప్రపోజ్ చేయాలో తెలియడం లేదా..? అయితే ముందుగా మీ ప్రియురాలు గురించి ఇవి తెలుసుకోండి..

Tips For Love Proposing : ప్రేమించడం ఒక ఎత్తయితే దానిని వ్యక్తపరచడం మరో ఎత్తు.. ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌కి ప్రేమ విషయం చెప్పడానికి

  • uppula Raju
  • Publish Date - 8:29 am, Sun, 28 March 21
మీరు లవ్‌‌లో ఉన్నారా..! ఎలా ప్రపోజ్ చేయాలో తెలియడం లేదా..? అయితే ముందుగా మీ  ప్రియురాలు గురించి ఇవి తెలుసుకోండి..
Love Proposing

Tips For Love Proposing : ప్రేమించడం ఒక ఎత్తయితే దానిని వ్యక్తపరచడం మరో ఎత్తు.. ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌కి ప్రేమ విషయం చెప్పడానికి హీరో ఐదేళ్ల సమయం తీసుకుంటాడు.. కనుక ప్రేమించడం ఎవరైనా చేస్తారు.. కానీ దానిని కావల్సిన వారికి చెప్పడంలోనే అసలు కిక్కు. నేటి యువత ఈ విషయంలో చాలా మదనపడిపోతున్నారు. ప్రేమ విషయం చెప్పడానికి రోజుల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే లవ్ ప్రపోజ్ చేసేముందు ప్రియురాలికి ఎలా దగ్గరవాలో ఈ విషయాల ద్వారా తెలుసుకోండి.. ఆ తర్వాత మీ పని సులువుగా మారిపోతుంది.

1. ఒక వ్యక్తికి ముందుగా దగ్గరవ్వాలంటే వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి.. రెండు మనసులు కలవాలంటే వారి అభిరుచులు కూడా దగ్గరగా ఉండాలి.. అందుకోసం మీ ప్రియురాలి ఇష్టాలను తెలుసుకోండి.. వారికి నచ్చిన ప్రదేశాలకు, సినిమాలకు తీసుకెళ్లండి.. మీ అభిరుచుల గురించి వారికి తెలియజేయండి.. అప్పుడు మీ పని సులువవుతుంది.

2. ఎదుటి వ్యక్తిని తొందరగా ఆకట్టుకోవాలంటే నవ్వుతూ మాట్లాడటం తప్పనిసరి. ముఖ్యంగా అమ్మాయిలకు నవ్వుతూ మాట్లాడేవారిపై మంచి అభిప్రాయం ఉంటుందని అందరకి తెలిసిన విషయమే.. సందర్భానికి తగినట్లుగా మాట్లాడుతూ మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయండి..

3. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారితో కచ్చితంగా నిజాయితీతో మెలగండి.. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా తగిన సమయం చూసుకొని వారికి అసలు నిజాలు చెప్పేయడం మంచిది. లేదంటే వారి దృష్టిలో బ్యాడ్‌గా పడే అవకాశం ఉంటుంది.

4. ఇక ఈ విషయం అందరూ చేసేదే అనుకో.. కానీ మీరు కొంచెం విభిన్నంగా ప్రయత్నించండి.. మీ ప్రియురాలి పుట్టిన తేదీ కనుక్కోవడం పెద్ద కష్టమేమి కాదు. ఈ క్రమంలో వాళ్ల బర్త్‌డేకు వారికి ఇష్టమైన బహుమతి అందించి మంచి మార్కులు సంపాదించండి.. ఇష్టమైన బహుమతి అంటే బాగా ఖరీదైనది కాదండి.. మీరు ఆమెను ఎంతలా ఆరాదిస్తున్నారో ఆ గిఫ్ట్ ద్వారా ఆమెకు తెలిసేలా చేయండి..

5. మీరు ప్రేమించే వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాస్త సాయం చేయండి.. మంచి సలహాలు ఇవ్వండి.. అంతేకాకుండా ఆమె ఏదైనా మంచి పనిచేసినప్పుడు, సాధించినప్పుడు దగ్గరుండి మరీ ప్రశంసించండి.. ఆమె వెన్నదన్నుగా నిలవండి అప్పుడే ఆమె మనసులో మీర స్థానం సంపాదిస్తారు..

కొడుకు దుబాయి వెళ్లాడు.. కోడలు విలన్‌గా మారిపోయింది.. 15రోజులుగా గేటు బయట వృద్ధ దంపతుల పడిగాపులు..!

Prasadam To Doorsteps: ఇకపై ఇంటికే ప్రసాదం.. తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ దేవాదాయ శాఖ..