Gold Silver Price Today: బంగారం ధరలు పెరిగాయి.. వెండి ధరలు తగ్గాయి.. ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price Today: ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలు తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఇక హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న బంగారం ధరలు...
Gold Silver Price Today: ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకానొక సమయంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలు తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఇక హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న బంగారం ధర ఆదివారం కాస్త పెరిగింది. ఇక వెండి విషయంలో మాత్రం స్వల్పంగా తగ్గింది. ఆదివారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. * దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి… రూ.44,050 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే రూ.210 పెరిగి.. రూ.48,050గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై రూ. 100 తగ్గి.. రూ.64,900గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 760 తగ్గి.. రూ. 43,000గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ కూడా రూ.760 తగ్గి.. రూ. 44,000 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి రూ. 64,900 గా ఉంది.
* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,900గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,710గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి రూ. 65,700 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.42,320 గా ఉండగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 46,170 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి రూ. 69,300గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.41,900 గా ఉండగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.45,710 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి రూ.69,300 గా ఉంది.
* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.41,900 గా ఉండగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,710 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి రూ.69,300 గా ఉంది.
* సాగరతీరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 41,900 గా ఉండగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,710 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి రూ. 69,300గా ఉంది.
Also Read: Air India: ఉన్నది రెండే మార్గాలు.. ఎయిర్ ఇండియాపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్