నాకు ఈ పదవి ఇచ్చినందుకు జగన్ కు ధన్యవాదాలు

నాకు ఈ పదవి ఇచ్చినందుకు జగన్ కు ధన్యవాదాలు

ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం రాష్ట్రమంతా ప్రచారం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ. శుక్రవారం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైయ్యారు యాక్టర్ పృథ్వీ. ఈ పదవి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాపై ఇంత బాధ్యతను పెట్టినందుకు పార్టీకి నేను రుణపడి ఉంటాను. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ గౌరవం ఇప్పించినందకు వైసీపీ అధినేత జగన్ కు ధన్యవాదాలు తెలిపారు యాక్టర్ పృథ్వీ. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేయాలని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 18, 2019 | 1:05 PM

ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం రాష్ట్రమంతా ప్రచారం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ. శుక్రవారం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైయ్యారు యాక్టర్ పృథ్వీ. ఈ పదవి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాపై ఇంత బాధ్యతను పెట్టినందుకు పార్టీకి నేను రుణపడి ఉంటాను. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ గౌరవం ఇప్పించినందకు వైసీపీ అధినేత జగన్ కు ధన్యవాదాలు తెలిపారు యాక్టర్ పృథ్వీ.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేయాలని తాను అనుకోవడంలేదని చెప్పారు. ఒక వేల పార్టీ ఎన్నికల్లో పోటీ చేయమంటే గిరిజన ప్రజలున్న చోట పోటీ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాను అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక కార్యకర్తను ఎలా గౌరవించాలో జగన్ కు తెలుసని అన్నారు పృథ్వీ. పార్టీ కోసం నేను 24 గంటలే కాదు 48 గంటలూ పని చేసే సత్తా నాకుందన్నారు. జగన్ తో ఫొటో దిగడమంటే ఓ దేవుడితో ఫొటో దిగినట్టే. నాకు తగిలిన దిష్టి పోవాలంటే కేఏపాల్ ఫొటో నా పక్కన ఉండాల్సిందే. సీఎం చంద్రబాబుకు అన్నీ కాపీ చేయడమే వచ్చని ఆరోపించారు పృథ్వీ. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తారు అని అన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu