రాకేష్ రెడ్డికి 8 రోజుల పోలీసు కస్టడీ

రాకేష్ రెడ్డికి 8 రోజుల పోలీసు కస్టడీ

హైదరాబాద్‌: ప్రవాసాంద్రుడు చిగురుపాటి జయరాం హత్యకేసు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కన్పించడం లేదు.  ప్రధాన నిందితులైన రాకేశ్‌రెడ్డి రోజుకోలా సమాధానాలు చెబుతుండంటంతో కేసు టర్నింగ్స్ తీసుకుంటుంది. అందుకే ప్రధాన నిందితులైన రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లకు 8 రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన మూడు రోజుల కస్టడీ గడువు ముగియడంతో వారిని శనివారం బంజారాహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారిని కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి […]

Ram Naramaneni

|

Feb 16, 2019 | 6:06 PM

హైదరాబాద్‌:

ప్రవాసాంద్రుడు చిగురుపాటి జయరాం హత్యకేసు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కన్పించడం లేదు.  ప్రధాన నిందితులైన రాకేశ్‌రెడ్డి రోజుకోలా సమాధానాలు చెబుతుండంటంతో కేసు టర్నింగ్స్ తీసుకుంటుంది. అందుకే ప్రధాన నిందితులైన రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లకు 8 రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన మూడు రోజుల కస్టడీ గడువు ముగియడంతో వారిని శనివారం బంజారాహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారిని కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, కస్టడీని పొడిగించాలని పోలీసులు కోరారు. దీంతో ఎనిమిది రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. అంతకుముందు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరి ఈ కస్టడీలోనైనా నిజానిజాలు బయటకు వస్తాయో, లేదో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu