'ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ముగిసే ప్రదేశం ఎదో తెలుసా..?

TV9 Telugu

11 May 2024

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోడ చైనాలో ఉంది. అదే 'ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'గా పిలిచే ఈ గోడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోడగా పేరుగాంచింది.

ప్రపంచంలోని ఏడు వింతల్లో 'ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ఒకటి. ఇది 2,300 సంవత్సరాల కంటే ముందే నిర్మించిన కట్టడం.

'ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' పొడవు 6300 కి.మీ. ఇది 5వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు నిర్మించడం జరిగింది.

దీని తయారీకి మొదట్లో చెక్క, రాయిని ఉపయోగించారు. ఇది షాన్హైగువాన్ నుండి మొదలై కియాన్హువాంగ్డావో నగరంలోని షాంఘై దగ్గర ముగుస్తుంది.

ఏడూ వింతల్లో ఒకటైన ఈ పొడవైన 'ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' చైనా దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంది.

చైనాలో ఉన్న అతి పెద్ద గోడ 'ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'కి సంబంధించి చాలా తప్పుడు వార్తల ప్రచారంలో ఉన్నాయి.

ఈ గోడను అంతరిక్షంలోకి కూడా చూడవచ్చు అంటారు, కానీ అలాంటిదేమీ లేదు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా దొరకలేదు.

ఈ గోడను ఏ ఒక్క రాజు నిర్మించలేదని, చైనాలోని చాలా మంది రాజులు వేర్వేరు సమయాల్లో నిర్మించారని చరిత్ర చెబుతోంది.