AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాంపూర్ సెక్టార్‌లో కూంబింగ్.. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఓ వైపు పాక్ సైన్యం జరుపుతున్న కాల్పులను ఎదుర్కొంటూ.. మరోవైపు లోయలో ఉగ్రవాదులను కూడా ఏరిపారేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్‌లో..

రాంపూర్ సెక్టార్‌లో కూంబింగ్.. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 23, 2020 | 6:48 PM

Share

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఓ వైపు పాక్ సైన్యం జరుపుతున్న కాల్పులను ఎదుర్కొంటూ.. మరోవైపు లోయలో ఉగ్రవాదులను కూడా ఏరిపారేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడందో ఆర్మీ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో రాంపూర్ సెక్టార్‌లోని సరిహద్దు ప్రాంతంలో హత్‌లంగా వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో చైనీస్ వెపన్స్‌తో పాటు.. ఇతర ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడ్డ వాటిలో 5 చైనీస్ పిస్టల్స్‌తో పాటు మ్యాగజైన్లు, 24 గ్రైనేడ్లు, ఓ ఏకే-47 తో పాటు మ్యాగజైన్‌.. ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.