AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో దేశంలోనే అతిపెద్ద రెండో ఫ్లాస్మా బ్యాంకు

కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. కరోనా బారిన పడినవారికి కాపాడుకునేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ కుస్తీ పడుతున్నాయి. మరోవైపు కోలుకున్న రోగుల నుంచి ఫ్లాస్మా సేకరించి కొవిడ్ బాధితులను రక్షిస్తున్నారు. తాజాగా తమిళనాడులో మరో ఫ్లాస్మా బ్యాంకు తెరిచారు అధికారులు.

Balaraju Goud
|

Updated on: Jul 23, 2020 | 7:24 PM

Share

కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. కరోనా బారిన పడినవారికి కాపాడుకునేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్నీ కుస్తీ పడుతున్నాయి. మరోవైపు కోలుకున్న రోగుల నుంచి ఫ్లాస్మా సేకరించి కొవిడ్ బాధితులను రక్షిస్తున్నారు. తాజాగా తమిళనాడులో మరో ఫ్లాస్మా బ్యాంకు తెరిచారు అధికారులు.

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల తొలి ప్లాస్మా బ్యాంకు ప్రారంభం కాగా, ఇప్పుడు తమిళనాడులో రెండో ప్లాస్మా బ్యాంకు ప్రారంభమైంది. రూ. 2.34 కోట్లతో వ్యయంతో ఈ ప్లాస్మాబ్యాంకును ఏర్పాటు చేసినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయ్ భాస్కర్ తెలిపారు. ప్లాస్మా విధానం సత్ఫలితాలు ఇస్తుండడంతో మరింత ఎక్కువగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇటీవల మదురై నలుగురు రోగులకు విజయవంతంగా చికిత్స చేసినట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే చెన్నై శివారు జిల్లాల్లోనూ ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతితో దేశంలోనే రెండో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించినట్టు స్పష్టం చేశారు. కరోనా నుంచి కోలుకున్నవారు ఫ్లాస్మా దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని మంత్రి పిలుపునిచ్చారు. కోవిడ్ రోగి కోలుకున్న 14 రోజుల తర్వాత ప్లాస్మా దానం చేయవచ్చని మంత్రి తెలిపారు. కాగా, తమిళనాడులో ఇప్పటి వరకు 1,86,492 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 51,765 కేసులు యాక్టివ్‌ కేసులు కాగా, 1,31,583 మంది కోలుకున్నారు.

Follow Us
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..

ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా

ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..

OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..

పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది

గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ

భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..

3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్

గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..