తెలంగాణలో డేంజ‌ర్‌గా క‌రోనా.. వ‌చ్చే 5 వారాలూ మ‌రింత‌ జాగ్ర‌త్త‌..: హెల్త్ డైరెక్ట‌ర్

తెలంగాణ రాష్ట్రంలోని క‌రోనా వైర‌స్ క‌మ్యునిటీలోకి వెళ్లింద‌ని పేర్కొన్నారు. ఇక‌పై ప్ర‌తీ ఒక్క‌రూ చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వ‌చ్చే నాలుగు, ఐదు వారాల్లో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే క‌రోనా క‌ట్ట‌డి..

తెలంగాణలో డేంజ‌ర్‌గా క‌రోనా.. వ‌చ్చే 5 వారాలూ మ‌రింత‌ జాగ్ర‌త్త‌..: హెల్త్ డైరెక్ట‌ర్
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 6:43 PM

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మ‌హ‌మ్మారి విస్తృతంగా వ్యాపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మార్క్‌ను దాటేశాయి కేసుల సంఖ్య‌. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని క‌రోనా వైర‌స్ క‌మ్యునిటీలోకి వెళ్లింద‌ని పేర్కొన్నారు. ఇక‌పై ప్ర‌తీ ఒక్క‌రూ చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వ‌చ్చే నాలుగు, ఐదు వారాల్లో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే క‌రోనా క‌ట్ట‌డి సాధ్యం కాద‌న్నారు.

క‌రోనా క‌ట్ట‌డికి మూడు సూత్రాల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌న్నారు. అవిః 1. మాస్క్ ధ‌రించ‌డం, 2. భౌతిక దూరం పాటించ‌డం, 3. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించడం. ఇక కోవిడ్ నియంత్ర‌ణ‌కు సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయ‌ల ఫండ్ కేటాయించిన‌ట్లు తెలిపారు. అలాగే 1100 మంది సిబ్బంది నియామ‌కం చేయ‌డానికి సీఎం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్నారు.

ఇక తెలంగాణ‌లో కేవ‌లం ఒక శాతం మాత్ర‌మే మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు తెలిపారు. ఇక 4 ల‌క్ష‌ల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల‌కు సిద్ధంగా ఉన్నాం. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 15 వేల‌కు పైగా బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కాగా వైర‌స్‌పై పోరాటంలో భాగంగా మా సిబ్బంది వెయ్యి మంది క‌రోనా బారిన ప‌డ్డారని వెల్ల‌డించారు. క‌రోనా క‌న్నా భ‌య‌మే అతిపెద్ద సమ‌స్య‌. కాబ‌ట్టి కోవిడ్ వ‌చ్చినా ఎంతో ధైర్యంగా ఉండాలి. ఏద‌న్నా స‌మ‌స్య‌లుంటే 104 నెంబ‌ర్‌కి కాల్ చేయండి. ఈ నెంబ‌ర్ 24 గంటలూ ప‌ని చేస్తుంది.

ఇక వాట్సాప్ నెంబ‌ర్ః 91541 70960 వాట్సాప్ నెంబ‌ర్‌కి రోజుకూ 150కి పైగానే కంప్లైంట్స్ వ‌స్తున్న‌ట్లు చెప్పారు. కాగా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన హాస్పిట‌ల్స్‌పై క‌ఠినంగా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు పేర్కొన్నారు.

Read More:

బ్రేకింగ్: రామ్‌గోపాల్ వ‌ర్మ‌‌ కార్యాల‌యంపై దాడి

షిర్డీ సాయిబాబా ద‌ర్శ‌న భాగ్యం ఎప్పుడంటే?

వాట్సాప్‌లో మ‌రిన్ని సేవ‌లు.. త్వ‌ర‌లోనే పెన్ష‌న్ స‌ర్వీసులు కూడా!