శభాష్ మిథున్‌రెడ్డిగారు.. కేశినేని నాని ట్వీట్

ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అటు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే.. స్వపక్షాన్ని కూడా టార్గెట్ చేస్తూ పొలిటికల్‌గా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ట్వీట్టర్ వేదికగా ఆయన వేసే పంచ్ డైలాగులు, కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆయన టీడీపీ నేతలను కూడా విమర్శించడానికి ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి. తాను ఏది చెప్పాలనుకున్నా ట్విట్టర్‌ ద్వారానే చెప్పడానికి అలవాటుపడ్డ నాని.. తాజాగా వైసీపీని టార్గెట్ చేశారు. వైసీపీ […]

శభాష్ మిథున్‌రెడ్డిగారు.. కేశినేని నాని ట్వీట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2019 | 6:18 PM

ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అటు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూనే.. స్వపక్షాన్ని కూడా టార్గెట్ చేస్తూ పొలిటికల్‌గా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ట్వీట్టర్ వేదికగా ఆయన వేసే పంచ్ డైలాగులు, కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆయన టీడీపీ నేతలను కూడా విమర్శించడానికి ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి.

తాను ఏది చెప్పాలనుకున్నా ట్విట్టర్‌ ద్వారానే చెప్పడానికి అలవాటుపడ్డ నాని.. తాజాగా వైసీపీని టార్గెట్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని పొగుడుతూనే సెటైర్ కూడా వేశారు. శెభాస్ మిథున్‌రెడ్డి గారు ఇప్పటికైనా ప్రత్యేక హోదా బాధ్యత మీదే అని ఒప్పుకున్నందుకు అంటూ ట్వీట్ స్టార్ట్ చేశారు. మీరు ప్రత్యేక హోదా సాధిస్తే నగరం నడిబొడ్డున సన్మానం చేస్తామని.. ఒకవేళ సాధించలేకపోతే మీరేమిచేస్తారో చెప్పగలరా ? అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో కేశినేని వైసీపీని ఇరకాటంలో పెట్టేలా ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది.