AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Tussle స్పీకర్ డెసిషన్ తో సీఎం షాక్… ముందే రాజీనామా !

ఇంకొన్ని గంటల్లో అసెంబ్లీలో బల పరీక్ష.. అంతలోనే స్పీకర్ షాకింగ్ డెసిషన్... దాంతో సీఎం షాక్ కు గురయ్యారు. అసెంబ్లీ సమావేశం అవడానికి ముందే రాజీనామాకు రెడీ అవుతున్నారు.. ఇది తెలుగు రాష్ట్రాల సంగతి కాదు..

MP Tussle స్పీకర్ డెసిషన్ తో సీఎం షాక్...  ముందే రాజీనామా !
Rajesh Sharma
| Edited By: |

Updated on: Mar 20, 2020 | 9:48 AM

Share

Madhyapradesh tussle reached final stage ఇంకొన్ని గంటల్లో అసెంబ్లీలో బల పరీక్ష.. అంతలోనే స్పీకర్ షాకింగ్ డెసిషన్… దాంతో సీఎం షాక్ కు గురయ్యారు. అసెంబ్లీ సమావేశం అవడానికి ముందే రాజీనామాకు రెడీ అవుతున్నారు.. ఇది తెలుగు రాష్ట్రాల సంగతి కాదు.. గత పదిహేను రోజులుగా రగులుతున్న మధ్యప్రదేశ్ లో రాజకీయం చివరి అంకానికి చేరుకున్న తరుణంలో చోటుచేసుకున్న ఆసక్తి కర పరిణామాలు.

యంగ్ జెనెరేషన్ ని కాదని వృద్ధ తరానికి పట్టం కట్టిన నాటినుంచే మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అసంతృప్తి.. ఏకంగా ప్రభుత్వ పతనానికి దారితీస్తోంది. ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై పార్టీని గెలిపిస్తే తీరా ముఖ్య మంత్రి పీఠం కమల్ నాథ్ కు అప్పగించడంతో జ్యోతిరాదిత్య సింధియా లో అసంతృప్తి మొదలైంది. దాన్ని రాజకీయ చతురతతో వాడుకున్న బీజేపీ .. జ్యోతిరాదిత్య సింధియా కు రాజ్యసభ సీటుతోపాటు, కేంద్ర మంత్రికి పదవి ఆఫర్ చేయడంతో ఎంపీ రాజకీయాల్లో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి .

జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది వేరు క్యాంపు కు వెళ్లడంతో మొదలైన నాటకీయ పరిణామాలు సుమారు పదిహేను రోజులు కొనసాగాయి. సింధియా బీజేపీ వైపు అడుగులు వేసే ముందే ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరిలించారు. వారిని బుజ్జగించడానికి కమల్నాథ్ మంత్రులను పంపినా.. ఒక దశలో తానే వెళ్లేందుకు సిద్ధపడ్డ కూడా వర్క్ అవుట్ కాలేదు.

మరోవైపు సింధియా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాజ్యసభకు ఎన్నికవడం జరిగిపోయాయి. ఈ క్రమంలో బీజేపీ నేతల అభ్యర్థన మేరకు గవర్నర్ లాల్జీ టాండన్ .. కమల్ నాథ్ ను బాల నిరూపణ చేసుకోమన్నా తనకు అవసరం లేదని.. తగిన బలం తన ప్రభుత్వానికి ఉందని వాదించడంతో విషయం అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. గురువారం సాయంత్రం సుప్రీమ్ కోర్ట్ నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేయడంతో శుక్రవారం కచ్చితంగా బాల పరీక్షకు సీఎం సిద్దపడాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి స్పీకర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ప్రజాపతి నిర్ణయం ముఖ్యమంత్రికి ఝలక్ ఇచ్చింది. సింధియా వర్గానికి చెందిన 16 ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి గురువారామ్ రాత్రి ఆమోదించడంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇపుడు కాంగ్రెస్ పార్టీ బలం 92కు పడిపోగా బీజేపీ బలం 107గా కొనసాగుతుంది.

మరోవైపు ఇప్పటివరకు కమల్ నాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సర్కార్ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో మరో దారిలేక బలపరీక్షకు ముందే కమల్ నాథ్ రాజీనామాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీ తరపున శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే.