Breaking: నిర్భయ కేసు: సొలిసిటర్ జనరల్ సంచలన వ్యాఖ్యలు
నిర్భయ కేసు దోషులకు ఎప్పుడు ఉరి శిక్ష పడుతుందా అని యావత్ దేశం ఎదురు చూస్తుంటే.. సొలిసిటర్ జనరల్ మాత్రం ఉరిశిక్ష అమలు నిరవధికంగా వాయిదా పడే సంకేతాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆయన రీజనింగ్ వింటే మాత్రం ఎవరికి నచ్చకపోయినా న్యాయవ్యవస్థలో వున్న వెసులుబాటును దోషులు అనుకూలంగా మలచుకుని శిక్షను వాయిదా వేయించుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. దోషులకిచ్చిన వారం రోజుల గడువు ముగియడంతో మంగళవారం ఢిల్లీ హైకోర్టులో నిర్భయ కేసు విచారణ కొనసాగింది. తాజాగా […]
నిర్భయ కేసు దోషులకు ఎప్పుడు ఉరి శిక్ష పడుతుందా అని యావత్ దేశం ఎదురు చూస్తుంటే.. సొలిసిటర్ జనరల్ మాత్రం ఉరిశిక్ష అమలు నిరవధికంగా వాయిదా పడే సంకేతాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ఆయన రీజనింగ్ వింటే మాత్రం ఎవరికి నచ్చకపోయినా న్యాయవ్యవస్థలో వున్న వెసులుబాటును దోషులు అనుకూలంగా మలచుకుని శిక్షను వాయిదా వేయించుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
దోషులకిచ్చిన వారం రోజుల గడువు ముగియడంతో మంగళవారం ఢిల్లీ హైకోర్టులో నిర్భయ కేసు విచారణ కొనసాగింది. తాజాగా మరోసారి దోషుల ఉరిశిక్షపై డెత్ వారెంట్ జారీ అవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులకు శిక్ష అమలు జరిపేందుకు తామెంతగా వాదించినా.. చివరికి మరోసారి డెత్ వారెంట్ పొందినా.. శిక్ష అమలు ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు లేవని తుషార్ మెహతా అన్నారు.
డెత్ వారెంట్ జారీ అయిన మరోక్షణం నాలుగో నిందితుడు పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ దాఖలు చేస్తాడని, దాంతో మొత్తం ప్రాసెస్ నిలిచిపోతుందని తుషార్ మెహతా అన్నారు. నలుగురు దోషుల్లో పవన్ గుప్తా ఇప్పటి వరకు తనకున్న న్యాయపరమైన వెసులుబాటును వినియోగించుకోలేదు. దాంతో డెత్ వారెంట్ వచ్చిన మరుక్షణం పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ సౌకర్యాన్ని వినియోగించుకుంటారని దాంతో ఉరిశిక్ష అమలు ప్రాసెస్ నిరవధికంగా వాయిదా పడుతుందని తుషార్ మెహతా అభిప్రాయపడుతున్నారు.