Breaking: నిర్భయ కేసులో కొత్త ట్విస్టు
ఉరి శిక్షను తప్పించుకునేందుకు దేశ న్యాయవ్యవస్థతో ఓ ఆటాడుకుంటున్న నిర్భయ దోషులు తాజాగా మరో ట్విస్టు ఇచ్చారు. తాజాగా డెత్ సెంటెన్స్ వస్తే.. పవన్ గుప్తా మెర్సీ పిటిషన్‌తో నిరవధిక జాప్యానికి తెరలేపుతారని అందరూ అనుకుంటుంటే.. అంతకు ముందే మరో మెర్సీ పిటిషన్‌తో తెరమీదికొచ్చాడు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ. నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో వినయ్ శర్మ ఒకడు. తాజాగా ఇతగాడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఏకంగా రాష్ట్రపతి చర్యను తప్పుపడుతూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. తన క్షమాభిక్ష […]
ఉరి శిక్షను తప్పించుకునేందుకు దేశ న్యాయవ్యవస్థతో ఓ ఆటాడుకుంటున్న నిర్భయ దోషులు తాజాగా మరో ట్విస్టు ఇచ్చారు. తాజాగా డెత్ సెంటెన్స్ వస్తే.. పవన్ గుప్తా మెర్సీ పిటిషన్‌తో నిరవధిక జాప్యానికి తెరలేపుతారని అందరూ అనుకుంటుంటే.. అంతకు ముందే మరో మెర్సీ పిటిషన్‌తో తెరమీదికొచ్చాడు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ.
నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో వినయ్ శర్మ ఒకడు. తాజాగా ఇతగాడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఏకంగా రాష్ట్రపతి చర్యను తప్పుపడుతూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన మానసిక స్థితి బాగాలేదని పిటిషన్‌లో పేర్కొన్న వినయ్ శర్మ.. మానసిక అనారోగ్యంతో వున్న వ్యక్తుల(దోషుల)ను మరణ శిక్ష నుంచి మినహాయించాలన్న పాత కేసునొకదాన్ని రెఫర్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.
మానసికంగా అనారోగ్యంతో ఉన్న దోషుల మరణశిక్షను రద్దు చేయాలని గతంలో వచ్చిన “షత్రుఘన్ చౌహాన్” కేసును వినయ్ శర్మ తన పిటిషన్‌లో ప్రస్తావించారు.