అమరావతి నుంచి సింగపూర్ కన్సార్షియం ఔట్.. కారణమిదేనా ?

అనుకున్నదే జరిగింది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం వైదొలిగింది. అమరావతి ప్రాంతంలోని 6.84 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ మంగళవారం ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ఈ నిర్ణయం సోమవారం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జి.వో. నెంబర్ 288 ఆధారంగా జరిగినట్లు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వంతో కలిసి ఏపీ ప్రభుత్వం గతంలో […]

  • Updated On - 12:22 pm, Tue, 12 November 19 Edited By: Anil kumar poka
అమరావతి నుంచి సింగపూర్ కన్సార్షియం ఔట్.. కారణమిదేనా ?

అనుకున్నదే జరిగింది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం వైదొలిగింది. అమరావతి ప్రాంతంలోని 6.84 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ మంగళవారం ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ఈ నిర్ణయం సోమవారం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జి.వో. నెంబర్ 288 ఆధారంగా జరిగినట్లు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వంతో కలిసి ఏపీ ప్రభుత్వం గతంలో చేసుకున్న అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు కూడా ఈ నిర్ణయంతో రద్దైనట్లయింది.

గతంలో అమరావతిని అత్యద్బుతంగా నిర్మించాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి సింగపూర్ కన్సార్షియంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్విస్ ఛాలెంజింగ్ విధానంలో అమరావతి అభివృద్ధి కోసం రాజధాని కోర్ ఏరియాలోని 6.84 ఎకరాల స్థలాన్ని సింగపూర్ కన్సార్షియంకు కేటాయంచారు. ఈ ప్రాంతంలో స్టార్టప్ ఏరియా పేరిట కోర్ కేపిటల్ నిర్మాణం జరపాలని భావించారు.

అయితే ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు వేరుగా వుండడం వల్ల సుదీర్ఘ చర్చలు, సమీక్ష తర్వాత ఈ ఒప్పందం నుంచి తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో సోమవారం జి.వో.288ని విడుదల చేస్తూ.. అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్స్ ప్రైవేటు లిమిటెడ్‌ని రద్దు చేశారు. ఈ కమ్యూనికేషన్ అందుకున్న సింగపూర్ దేశ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ.. ఏపీ ప్రభుత్వం అభిమతం మేరకు పరస్పర అంగీకరంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.